పైలట్ లైసెన్స్ సాధించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే..! ఎమోషనల్ ట్వీట్..!

ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా పనిచేసిన రాయలసీమ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatrami Reddy).. అధికారం కోల్పోయాక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. అయితే ఎప్పుడూ సామాజిక అంశాలపై ట్వీట్లు చేసే ఆయన ఉన్నట్లుండి ఓ షాకింగ్ ట్వీట్ పెట్టారు. తాను పైలట్ లైసెన్స్ సాధించినట్లు ఆయన ఇందులో వెల్లడించారు. అంతే కాదు ఈ విషయాన్ని అంతే ఎమోషనల్ గా ఆయన ట్వీట్ లో అభిమానులతో పంచుకున్నారు.

హైదరాబాద్ మెటా ఆఫీసుపై యూత్ కాంగ్రెస్ దాడి- అకౌంట్ల బ్లాక్ పై నిరసన..!
హైదరాబాద్ మెటా ఆఫీసుపై యూత్ కాంగ్రెస్ దాడి- అకౌంట్ల బ్లాక్ పై నిరసన..!

కల నుండి నిజమైంది! అంటూ కేతిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. ఒక కలగా మొదలైనది చివరికి నిజమైందని ఆయన తెలిపారు.
తన మొదటి శిక్షణా విమాన ప్రయాణం నుండి పైలట్ లైసెన్స్ సంపాదించే వరకు, ఈ ప్రయాణం ఎన్నో పాఠాలు, సవాళ్లు, అంకితభావం మరియు మరపురాని క్షణాలతో నిండి ఉందని కేతిరెడ్డి వెల్లడించారు. ప్రతి విమాన ప్రయాణం తనను తన కలకు ఒక అడుగు దగ్గర చేసిందని ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే భావోద్వేగంతో తెలిపారు.

YSRCP Leader Kethireddy Achieves Dream of Becoming a Licensed Pilot Shares Proud Moment

యలహంక ఇంటిపై కోర్టుకు జగన్ ?- షర్మిలను అడ్డుకోవాలంటూ..!
యలహంక ఇంటిపై కోర్టుకు జగన్ ?- షర్మిలను అడ్డుకోవాలంటూ..!

ఈ రోజు, తాను గర్వంగా చెప్పగలనని, తాను అధికారికంగా లైసెన్స్ పొందిన పైలట్‌ని! అని విమానం ఎమోజీని పెట్టి మరీ కేతిరెడ్డి వాక్యం రాశారు. నా రెక్కలు సంపాదించే ప్రయాణం పూర్తయింది, కానీ ఆకాశంలో నా సాహసం ఇప్పుడే మొదలైంది. అంటూ తన భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నారు. కల కన్నాను. దాని కోసం పనిచేశాను. దాన్ని సంపాదించాను. అంటూ గర్వంగా కేతిరెడ్డి తన ట్వీట్ ను ముగించారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు అంతే ఎమోషనల్ కావడంతో పాటు దాన్ని రీట్వీట్ చేసి వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన నేత పైలట్ కావడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+