వైఎస్సార్సీపీ విజ‌యాల‌ను టీడీపీ ఖాతాలో వేసుకున్నారు: మాజీమంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కౌంటింగ్ కేంద్రాల్లో తారుమారు చేసి, వైఎస్సార్‌సీపీ గెలిచిన స్థానాలను తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకోవడం ద్వారా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల దశ నుంచి మొదలైన అక్రమాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు పోలింగ్‌తో ఆగకుండా కౌంటింగ్‌ లోనూ కొనసాగాయని ఆరోపించారు.

రీకౌంటింగ్ పేరుతో ఓట్ల లెక్కలను మార్చడం, గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇవ్వకుండా జాప్యం చేయడం, ఇచ్చిన డిక్లరేషన్లను సైతం చించివేసి కొత్తగా ఫలితాలు ప్రకటించడం వంటి దారుణాలకు కూటమి ప్రభుత్వం పాల్పడిందని ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నికల అధికారులు, పోలీసు వ్యవస్థను అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని మండిప‌డ్డారు. ప్రజలు వేసిన ఓటుకు విలువ లేకుండా చేసి, అధికార పార్టీ నేతలు చెప్పిన వారినే గెలిచినట్లు ప్రకటించే పరిస్థితిని తీసుకొచ్చారని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Ex-Minister Kakani Govardhan Reddy slams TDP Altered Election Results and Insulted People s Mandate

రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలును చెప్పుకోలేని చంద్రబాబు, ఎన్నికల్లో గెలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ప్రతి ఆధారాన్ని వెలుగులోకి తీసుకొస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో వైసీపీ అభ్యర్థి తాతా నాగేంద్రమ్మకు మొదట 11 ఓట్ల మెజారిటీ వచ్చినా, రీకౌంటింగ్ పేరుతో నోటా ఓట్లను కలిపి టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం తమ్మినపట్నంలో బొమ్మి సుజాతమ్మ ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచినప్పటికీ, రీకౌంటింగ్ తర్వాత ఒక్క ఓటుతో ఓడిపోయినట్లు ప్రకటించారు. తనకు జరిగిన అన్యాయంపై నిరసన తెలిపిన ఆ మహిళను పోలీసులు బురదలో ఈడ్చుకెళ్లడం అత్యంత అమానుషం అన్నారు. ఒక మహిళకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలన్నారు.

తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం ఇల్లత్తూరులో దేవికకు 17 ఓట్ల మెజారిటీ వచ్చినా, రీకౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థికి మూడు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు ప్రకటించారు. నిరసన తెలిపిన మాజీ మంత్రి రోజాను పోలీసులు ఈడ్చుకెళ్లారని అసహనం వ్యక్తం చేశారు. గణపవరంలో భవన కుమారికి 37 ఓట్ల మెజారిటీ ప్రకటించిన తర్వాత డిక్లరేషన్ ఆలస్యం చేసి టీడీపీ అభ్యర్థి నాలుగు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారన్నారు.

ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన తర్వాత మిగిలిన స్థానాల కౌంటింగ్‌లో గందరగోళం సృష్టించారన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ రాళ్లబూదుగూరులో మా అభ్యర్థికి 17 ఓట్ల ఆధిక్యం వచ్చినప్పటికీ, మూడుసార్లు రీకౌంటింగ్ నిర్వహించి టీడీపీకి మూడు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు ప్రకటించుకున్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఆరోపణలు రావడం ఎన్నికల వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. నవంబర్ 13న షెడ్యూల్.. మూడుదశల్లో పోలింగ్!
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. నవంబర్ 13న షెడ్యూల్.. మూడుదశల్లో పోలింగ్!

ప్ర‌జలు వేసిన ఓట్లను లెక్కించే అధికారం అధికారులకు ఇచ్చారు కానీ, ప్రజల తీర్పును మార్చే అధికారం ఎవరిచ్చారు? ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి రౌండ్ ఓట్ల వివరాలు నమోదు చేయాలి, ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి, మొత్తం ఓట్ల లెక్కలను పారదర్శకంగా ప్రకటించాలి. కానీ అనేక చోట్ల ఈ నిబంధనలను పక్కనపెట్టి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు అనుగుణంగా వ్యవహరించారనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ప్రజల ఓటును అవమానించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో తప్పకుండా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+