365 కరవు మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్.. ఏడాది పాటు అసలు, వడ్డీ వాయిదా

ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన తెలంగాణ రైతులకు పెద్ద ఊరట లభించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 365 మండలాల్లో పంట రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ 365 మండలాల్లో 111 తీవ్ర కరవు మండలాలు, 254 మధ్యస్థ కరవు మండలాలు ఉన్నాయి.

ఈ నిర్ణయం ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య కాలంలో రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లింపులను ఏడాది పాటు వాయిదా వేసుకునే వెసులుబాటు లభిస్తుంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల వేళ రైతులపై వెంటనే చెల్లింపుల ఒత్తిడి తగ్గి, వచ్చే ఏడాది పంట చేతికి వచ్చిన తర్వాత తీర్చుకునే సౌలభ్యం కలుగుతుంది.రుణాలను రీషెడ్యూల్ చేసుకున్నప్పటికీ రైతుల సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది.

Crop Loan Rescheduling in 365 Drought-Hit Telangana Mandals Principal and Interest Deferred for a Year

అర్హులైన రైతుల ఖాతాలను గుర్తించి, ఆయా గ్రామాల్లో జాబితాలను ప్రదర్శించనున్నారు. రీషెడ్యూల్ కోరుకునే రైతులు సంబంధిత బ్యాంకులకు సమ్మతి పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా 2026 ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 139.28 లక్షల ఎకరాల నుంచి 126.06 లక్షల ఎకరాలకు తగ్గింది; ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పడిపోయింది.

రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, రాబోయే యాసంగి సీజన్‌లో వరి కంటే తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. పెసర, మినుము, వేరుశనగ, మొక్కజొన్న, శనగ, కుసుమ వంటి పంటల సాగుకు సబ్సిడీలు అందించడంతో పాటు, ఆరుతడి పంటల్లో విజయం సాధించిన రైతుల అనుభవాలను తోటి రైతులకు పంచేలా 'రైతు నేస్తం' ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

చారిత్రక మెట్ల బావుల్లో కళా సంబరం.. వారసత్వ వైభవానికి కొత్త ఊపు!
చారిత్రక మెట్ల బావుల్లో కళా సంబరం.. వారసత్వ వైభవానికి కొత్త ఊపు!

కూరగాయలు, ఆరుతడి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో రైతు బజార్లు, కొనుగోలు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కరువు ప్రభావిత మండలాల్లో తాగునీటి సరఫరా, పశువులకు దాణా, నీటి వసతి కల్పనతో పాటు, కొత్త రుణాల జారీలో బీమా క్లెయిమ్‌ల పరిష్కారం కోసం వేచి చూడకుండా అర్హులైన రైతులకు సహకారం అందించే అంశంపై కూడా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+