చారిత్రక మెట్ల బావుల్లో కళా సంబరం.. వారసత్వ వైభవానికి కొత్త ఊపు!

తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని చారిత్రక మెట్ల బావులు కేవలం ప్రాచీన ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనాలు మాత్రమే కాదని, అవి ఒకప్పుడు సామాజిక జీవనానికి, జల సంరక్షణకు కీలక కేంద్రాలుగా నిలిచాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. చారిత్రక మెట్ల బావులను వేదికలుగా చేసుకుని నిర్వహిస్తున్న 'బావోలి ఆర్ట్ సంగం' వంటి కళా, సాంస్కృతిక వేడుకలు నేటి తరానికి మన వారసత్వ సంపద విలువను చేరువ చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

డిసెంబర్ 1, 2026 నుంచి జనవరి 10, 2027 వరకు 40 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో సమకాలీన కళా ప్రదర్శనలు, సంగీత, నృత్య, నాటక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. కథక్, గజల్స్, సూఫీ సంగీతం, జానపద కళలు, థియేటర్ ప్రదర్శనలతో పురాతన కట్టడాలకు కొత్త కళ సంతరించనున్నారు.

historic stepwells cultural fest HYDRAA Commissioner Highlights Baoli Art Sangam with Cultural Fest in Historic Stepwells

సాధారణ గ్యాలరీలు, మ్యూజియంలకే పరిమితం కాకుండా చారిత్రక మెట్ల బావుల వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆయా ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని ప్రజలు నేరుగా అనుభూతి చెందే అవకాశం లభిస్తుంది. ఈ వేడుకల తొలి ఎడిషన్‌లో భాగంగా బన్సీలాల్‌పేట్ మెట్ల బావి, గోల్కొండ కోటతో పాటు నగరం, రాష్ట్రంలోని పలు ఇతర పురాతన మెట్ల బావులు, వారసత్వ కట్టడాల వద్ద కార్యక్రమాలు జరగనున్నాయి.

ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై చెత్త, వ్యర్థాలతో నిండిపోయిన బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని పునరుద్ధరించిన తీరు, ఆ తర్వాత అది పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా మారిన అనుభవం ఇతర బావుల పునరుద్ధరణకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నగరాల్లో పెరుగుతున్న నీటి అవసరాలు, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో సంప్రదాయ నీటి నిల్వ వ్యవస్థలను కాపాడుకోవడం అత్యవసరమని నిపుణులు, అధికారులు గుర్తు చేస్తున్నారు.

రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంలో కొత్త మార్గదర్శకాలు.. ఆధార్ లింకేజీ తహప్పనిసరి!
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంలో కొత్త మార్గదర్శకాలు.. ఆధార్ లింకేజీ తహప్పనిసరి!

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు మెట్ల బావులు ఎంతో దోహదపడతాయి. కళా సంబరాల ద్వారా ప్రజల్లో ఆసక్తి పెంచడంతో పాటు, ఆక్రమణల నియంత్రణ, శాస్త్రీయ పునరుద్ధరణ చర్యల ద్వారా ఈ చారిత్రక జల వనరులను భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించే దిశగా కృషి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+