డీలిమిటేషన్ కాదు... విపక్షాల అసలు భయం జెర్రీ మాండరింగేనా? తాజా డిమాండ్లు..!

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు వీలుగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును (Delimitation bill) ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ బిల్లును మెజార్టీ విపక్షాలు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాయి. దీని వెనుక డీలిమిటేషన్ వల్ల పెరిగే నియోజకవర్గాల సంఖ్యలో మార్పులపై భయాల కంటే వాటిలో జరిగే సరిహద్దుల మార్పులు బీజేపీ జెర్రీ మాండరింగ్ ( ఈ సరిహద్దుల మార్పుల వల్ల కలిగే అనుచిత లబ్ది)పై అసలు భయాల్ని విపక్షంలో రేకెత్తిస్తున్నాయి.

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే డీలిమిటేషన్ కమిషన్ బీజేపీకి, దాని మిత్రపక్షాలకు లబ్ది కలిగించే విధంగా దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేస్తుందని విపక్షాలు భయపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అండతో ఓట్ల చోరీకి పాల్పడుతున్న కేంద్రం.. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా సీట్ల చోరీకి కూడా పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. దీన్నే జెర్రీ మాండరింగ్ గా (Gerrymandering) అభివర్ణిస్తున్నాయి. అయితే విపక్షాల భయాల వెనుక ఓ హేతుబద్దమైన కారణం కూడా ఉంది. ఈ నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేయబోతే డీలిమిటేషన్ కమిషన్ లో కేంద్రం లేదా వారు నియమించే అధికారులే ఉంటారు. వారు కేంద్రాన్ని కాదని ఎలాంటి మార్పులు చేయరన్నది విపక్షం ఆరోపణ. దీన్ని బీజేపీ తోసిపుచ్చుతోంది.

Centre s New Delimitation Plan Sparks Gerrymandering Fears Can Courts Ensure Fair Representation

ప్రధాని మోడీ ఈ నియోజకవర్గాల పునర్విభజనలో అపరిమిత స్వేచ్ఛ కోరుకుంటున్నారని, అందుకే డీలిమిటేషన్ కమిషన్ లో విపక్షాలకు చోటు లేకుండా తమ వారితోనే ఈ తంతు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
సింపుల్ గా చెప్పాలంటే ఓ రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా నియోజకవర్గాల సరిహద్దుల్ని మార్చడమనే జెర్రీ మాండరింగ్ ప్రక్రియ కచ్చితంగా బీజేపీకి ప్రయోజనం చేకూర్చబోతోందని కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో డీలిమిటేషన్ కమిషన్ చేయబోయే మార్పులు వారికి భవిష్యత్తులో వారి గెలుపు అవకాశాల్ని సంక్షిష్టంగా మారుస్తాయని భయపడుతున్నారు. బీజేపీ మాత్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలోని స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ ఈ మార్పులు చేస్తుందని చెబుతోంది. కాంగ్రెస్ భయాల్ని ప్రస్తావిస్తూ గతంలో వారు చేసిన నియోజకవర్గాల పునర్విభజనలో జెర్రీ మాండరింగ్ జరిగినట్లు వారు అంగీకరిస్తారా అని బీజేపీ ప్రశ్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+