రెండో టెస్ట్ లోనూ చేతులెత్తేసిన టీమిండియా: పట్టు జారింది

న్యూజిలాండ్ తో క్రైస్ట్‌చర్చ్‌ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ పై భారత్ పట్టు జారవిడుచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ మూడో రోజు రెండో సెషన్ లోపే కుప్పకూలింది. కివీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ చెల్లాచెదురైంది. ఒక్క ధృవ్ జురెల్ మాత్రమే నిలదొక్కుకోగలిగాడు. జట్టును ఆ కొంతవరకైనా గట్టెక్కించాడు. 88 పరగులు చేశాడు. లోయర్ ఆర్డర్ లో బౌలర్ ఆకాష్ దీప్ 29 పరుగులతో అతనికి చక్కటి సహకారం అందించాడు.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు స్పష్టమైన పైచేయి సాధించింది. ఇప్పటికే 110 పరుగుల ఆధిక్యంలో ఉన్న కివీస్ జట్టును రెండో ఇన్నింగ్స్‌లో సాధ్యమైనంత త్వరగా ఆలౌట్ చేసి, నాలుగో ఇన్నింగ్స్‌లో స్వల్ప ఛేజింగ్ లక్ష్యాన్ని మాత్రమే ఉంచేలా టీమిండియా బౌలర్లు శ్రమించాల్సి ఉంటుంది. హేగ్లీ ఓవల్ పిచ్ నుంచి సీమ్, బౌన్స్ లభిస్తుండటంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఏ మేరకు ప్రభావం చూపుతారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.

India were bowled out for 246 in response to New Zealand first innings Dhruv Jurel scored with 88

ఇన్నింగ్ ఆరంభం నుంచే భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతూ వచ్చింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగులేమీ చేయకుండానే మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. అక్కడ ఆరంభమైన పరుగుల పతనం కొనసాగుతూ వచ్చింది. ఎక్కడ కూడా భారీ భాగస్వామ్యం నమోదు కాలేదు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 25, దేవదత్ పడిక్కల్ 21, కెప్టెన్ శుభ్‌మన్ గిల్- 17, రిషభ్ పంత్- 23 పరుగులు చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

కార్తీకమాసం చివరి సోమవారం ఎప్పుడు
కార్తీకమాసం చివరి సోమవారం ఎప్పుడు

ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ ధృవ్ జురెల్ ఎంతో నిగ్రహంతో బ్యాటింగ్ చేస్తూ భారత ఇన్నింగ్స్‌ను కొంతవరకు నిలబెట్టాడు. న్యూజిలాండ్ పేస్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ 170 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 88 పరుగులు సాధించాడు. శతకానికి చేరువైన వేళ కైల్ జేమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటవడంతో జురెల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఒత్తిడి పరిస్థితుల్లో జురెల్ కనబరిచిన ఈ సంయమనం భారత తొలి ఇన్నింగ్స్ గౌరవప్రదంగా ముగియడానికి ప్రధాన కారణమైంది.

లోయర్ ఆర్డర్ లో ఆకాశ్ దీప్ అతనికి తగిన సహకారాన్ని అందించాడు. 52 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్- 10, గుర్నూర్ బ్రార్- 10 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లల్లో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, జాకబ్ డఫీ చెరో రెండు వికెట్లు తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+