ఈ 11 నెలల్లో రూ. 68,000 తగ్గిన బంగారం ధర
దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గత కొద్ది రోజులుగా భారీగా తగ్గుతూ వస్తోన్నాయి. కిందటి వారంలో స్వల్పంగా కోలుకుని రికవరీ అయినప్పటికీ.. తగ్గిన రేట్లతో పోల్చుకుంటే ఇది నామమాత్రమే. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. ప్రత్యేకించి డాలర్ బలపడటం, ఫెడ్ రిజర్వ్ రేట్లు, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి.
ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ తో పాటు రీటైల్ లోనూ గత వారంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఎంసీఎక్స్ లో డిసెంబర్ 4 ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్ వెండి ధర క్రితం వారం చివరి లావాదేవీల నాటికి కొంత మేర పెరిగింది. కిలో రూ.1,52,843 వద్ద ముగిసింది. వారం చివర్లో వెండి మెరుపులు కనిపించినప్పటికీ.. దాని రికార్డు స్థాయి రేట్లతో పోల్చుకుంటే చాలా తక్కువ మొత్తానికి ట్రేడ్ అవుతోంది.

ఎంసీఎక్స్ వెండి ఆల్‌టైమ్ గరిష్ఠ ధర ఈ ఏడాది జనవరి 29న రూ. 4,20,048 గా నమోదైన సంగతి తెలిసిందే. కిందటి శుక్రవారం నాటికి ఆ ధరలో రూ. 2,67,205 మేర తగ్గుదల కనిపించింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం కిందటి వారంలో కిలో వెండి ధర రూ.1,54,300 లకు లభిస్తోంది.
వెండి తరహాలోనే పసిడి ధర కూడా ఎంసీఎక్స్, దేశీయ మార్కెట్లలో గత వారంలో పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ 4 ఎక్స్‌పైరీ గల 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఎంసీఎక్స్‌లో రూ.1,25,350 వద్ద క్లోజ్ అయింది. పసిడి తన ఆల్‌టైమ్ రికార్డు గరిష్ఠ స్థాయి రూ. 1.83 లక్షల కంటే ఇప్పటికీ 10 గ్రాములకు రూ. 68,000 వరకు తక్కువగానే లభిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 1,23,893 నుంచి రూ. 1,26,299కు పెరిగింది.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,590
ముంబై..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589












Click it and Unblock the Notifications
