డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి పోరాటానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనం.. ఎంపీలకు దిశానిర్దేశం!

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ఈ అంశంపై పార్టీ అగ్రనాయకత్వం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూ ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్న వేళ ఈ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమై, పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వైఖరిపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఎంపీలు అందరూ అందుబాటులో ఉండాలని ఇప్పటికే సూచనలు వెళ్లాయి. నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలును పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టడంపై ఇండియా కూటమి లేవనెత్తుతున్న అభ్యంతరాలను బలంగా వినిపించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

CM Revanth Reddy Heads to Delhi for Joint Strategy on Delimitation Bill with other states CMs Guided Party MPs

నియోజకవర్గాల పెంపు ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం కీలకంగా మారింది. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరగకూడదనే వాదనను సీఎం రేవంత్ రెడ్డి ముందు నుంచి వినిపిస్తున్నారు. సీట్ల పంపిణీ కేవలం జనాభా ఆధారంగా కాకుండా, రాష్ట్రాలు సాధించిన ఆర్థిక ప్రగతి, జీఎస్డీపీ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన గతంలోనే ప్రతిపాదించారు.

జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటు, కీలక శాఖల కేటాయింపులో దక్షిణాది బలం తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. డీలిమిటేషన్ బిల్లు విషయంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పునర్విభజన పేరుతో సమాఖ్య స్ఫూర్తికి, సామాజిక న్యాయానికి విఘాతం కలగకుండా చూడాలని, విస్తృత సంప్రదింపుల తర్వాతే ముందుకు వెళ్లాలని డిమాండ్ చేస్తోంది.

ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్-2026.. 11 నూతన పాలసీలు ఆవిష్కరణ!

ప్రతిపాదిత మార్పుల వల్ల రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ బిల్లుకు మద్దతు ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గదని, మహిళా సాధికారతకు ఈ నిర్ణయాలు దోహదపడతాయని స్పష్టం చేస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+