డీఎంకే ఎంపీలకు కేంద్రం ప్రమోషన్

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. సభ్యుల సీటింగ్ లో కీలక మార్పులు చేర్పులు చేపట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్, చర్చల్లో పాల్గొనే సభ్యులకు వారి సీట్లను ఖరారు చేసింది. 97 మంది సభ్యుల సీటింగ్ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో సభ్యుల స్థానాల రూపురేఖలు పూర్తిగా మారినట్టవుతుంది.

ఈ క్రమంలో డీఎంకే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) సభ్యులకు ప్రమోషన్ దక్కినట్టయింది. డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ ఎంపీల సీట్ల కేటాయింపులో స్పష్టమైన మార్పులు చేసింది. ఇప్పటివరకు ప్రతిపక్షాల ఇండియా కూటమి సభ్యులతో కలసి ఒకే వరుసలో కూర్చున్న డీఎంకే ఎంపీలు.. ఇకపై సభలో వారికి దూరంగా ప్రత్యేకంగా కేటాయించిన స్థానాల్లో ఆసీనులు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు తెలపడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.

Seating arrangements for 97 MPs have been rejigged in the Lok Sabha 22 DMK and eight of NCP SP

లోక్‌సభ సచివాలయం ఖరారు చేసిన నూతన సీటింగ్ అమరిక ప్రకారం డీఎంకే ఎంపీ కణిమోళి, ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సులేకు ప్రాధాన్యత లభించింది. వీరిద్దరూ ఒకే చోట కూర్చోనున్నారు. తాజా సీట్ల వర్గీకరణ ప్రకారం కనిమోళికి నంబర్ 357 సీటును కేటాయించారు. టీఆర్ బాలు- 355, ఏ రాజా- 356 వ నంబర్ కుర్చీని ఖరారు చేశారు. దయానిధి మారన్‌, ఇతర ఎంపీలకు అదే బ్లాక్‌లోని సీట్లు దక్కాయి.

థ్యాంక్స్ గివింగ్ వేళ.. భారీ భూకంప తీవ్రత: వణికిన కాలిఫోర్నియా
థ్యాంక్స్ గివింగ్ వేళ.. భారీ భూకంప తీవ్రత: వణికిన కాలిఫోర్నియా

దీనివల్ల డీఎంకే సభ్యులందరూ కూడా కాంగ్రెస్ తో పాటు ఇతర ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాల సరసన కాకుండా ఒకే చోట ప్రత్యేకంగా ఆసీనులు అవుతారు. ఇండియా కూటమి నుంచి వైదొలిగిన తర్వాత తమ పార్టీ సభ్యులకు సభలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరుతూ కనిమోళి ఈ ఏడాది మే నెలలోనే లోక్ సభ సెక్రెటేరియట్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మార్పులతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే), కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీల సీట్లలో కూడా సర్దుబాట్లు సంభవించాయి.

అలాగైతేనే మద్దతిస్తాం- ఆపై మీ ఇష్టం: కేంద్రానికి స్టాలిన్ క్లియర్ మెసేజ్
అలాగైతేనే మద్దతిస్తాం- ఆపై మీ ఇష్టం: కేంద్రానికి స్టాలిన్ క్లియర్ మెసేజ్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, అఫ్జల్ అన్సారీ, ధర్మేంద్ర యాదవ్‌తో పాటు ఆ పార్టీకే చెందిన మరికొందరు ఎంపీలకు కొత్త సీట్లను కేటాయించారు. పార్లమెంట్ లో సీటింగ్ విధానాన్ని ఓ సాధారణ ప్రక్రియగా భావించరు. సభలో ఆయా రాజకీయ పార్టీలకు సంఖ్యాబలం, వ్యూహాత్మక స్థానాలు, కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఉండే సంబంధాలకు ఇది అద్దం పట్టేది కావడం వల్ల దీనికి ప్రాధాన్యత లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+