థ్యాంక్స్ గివింగ్ వేళ.. భారీ భూకంప తీవ్రత: వణికిన కాలిఫోర్నియా

అమెరికా కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. లాస్ ఏంజిలిస్ తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. థాంక్స్ గివింగ్ సెలెబ్రేషన్స్ కొనసాగుతోన్న వేళ హఠాత్తుగా భూమి కంపించడంతో ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో ఉన్న వాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదవుతోండటంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.0 గా రికార్డయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:36 నిమిషాలకు భూమి ప్రకోపించింది. మన్‌హటన్ తీరానికి దక్షిణ దిశగా సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో సముద్రం గర్భంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి సుమారు 12 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల ఈ ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది.

Today Earthquake Magnitude 5 0 on Richter scale jolts Manhattan California After Shocks detected

ప్రధాన భూకంపం తర్వాత దాదాపు 45 నిమిషాల వ్యవధిలోనే వరుసగా ఆఫ్టర్ షాక్స్.. అంటే తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. 19 సార్లు తేలికపాటి ప్రకంపనలు నమోదైనట్లు యూఎస్జీఎస్ వివరించింది. వీటి తీవ్రత 2.5 నుంచి 3.7 వరకు నమోదైంది. భూకంప కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసడేనా సిటీ వరకు కూడా దీని తీవ్రత కనిపించింది. పలుచోట్ల ఆస్తినష్టం సంభవించింది. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని పక్కకు ఒరిగిపోయాయి. షాపింగ్ మాల్స్ లల్లో వస్తువులు కిందపడ్డాయి.

రెండో టెస్ట్ లోనూ చేతులెత్తేసిన టీమిండియా: పట్టు జారింది
రెండో టెస్ట్ లోనూ చేతులెత్తేసిన టీమిండియా: పట్టు జారింది

కెరటాలు ఎగిసిపడటంతో మన్‌హటన్ బీచ్ ను ఖాళీ చేయించారు. తాత్కాలికంగా మూసివేశారు. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. వీటికి సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. లాస్ ఏంజిలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనం కదలిపోయింది. సీలింగ్ టైల్స్ ఊడి కిందపడిపోయాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం, ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

థాంక్స్ గివింగ్ సెలెబ్రేషన్స్ నడుస్తుండటంతో దక్షిణ కాలిఫోర్నియాలోని పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ లల్లో సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు కనిపించారు. ఇటువంటి రద్దీ సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. భూకంపం సంభవించిన వెంటనే లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్టమెంట్ నగర వ్యాప్తంగా అత్యవసర తనిఖీలు ప్రారంభించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫైర్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని రంగంలోకి దించారు.

మౌలిక సదుపాయాల భద్రతను సమీక్షించడం, రోడ్లు, వంతెనలు, విద్యుత్ సరఫరా లైన్లు, తాగునీటి వ్యవస్థలు, ఇతర కీలక కట్టడాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో స్థానిక అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు, గాయపడినట్లు సమాచారం అందకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నామని లాస్ ఏంజిలిస్ మేయర్ వెల్లడించారు.

భూకంపం సంభవించిన కొద్దిసేపటికే షెవ్రాన్ ఎల్ సెగుండో రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. భూకంపం వల్ల రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం జరిగిందేమోనని వార్తలు వ్యాపించాయి. స్థానిక యంత్రాంగం వెంటనే స్పందించింది. దీన్ని ఖండించింది. భూకంపం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు రిఫైనరీ ఆటోమేటిక్ గా నిలిచిపోతుందని, ఈ క్రమంలో ప్లాంట్‌లోని అదనపు గ్యాస్‌ను బయటికి పంపించే ఫ్లేరింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+