ఎలాన్ మస్క్ ను వాడి అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్..! షాకింగ్ రిపోర్ట్..!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం ఎన్నెన్నో మలుపులు తిరిగి ప్రస్తుతం కాస్త శాంతించింది. అయితే ఈ యుద్ధం పశ్చిమాసియాతో పాటు పలు దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపింది. అంతే కాదు అమెరికాకు చెందిన పలు సంస్థలపైనా ప్రభావం చూపింది. ఇదే క్రమంలో పలు అమెరికన్ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటి ఆస్తులపై దాడులు చేసిన ఇరాన్ (Iran).. అదే సమయంలో ఓ కంపెనీని కూడా తమ యుద్ధానికి అనుకూలంగా వాడుకుంది. అదే ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్ లింక్ (Starlink).

డీలిమిటేషన్ తో జెర్రీ మాండరింగ్..! బీజేపీ గేమ్ ప్లాన్ బయటపెట్టిన కాక్రోచ్ పార్టీ..!
డీలిమిటేషన్ తో జెర్రీ మాండరింగ్..! బీజేపీ గేమ్ ప్లాన్ బయటపెట్టిన కాక్రోచ్ పార్టీ..!

స్టార్ లింక్ ను వాడేసిన ఇరాన్ (Iran)

అమెరికా-ఇజ్రాయెల్ తమపై దాడులకు దిగడంతో ఇరాన్ ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని వారి మిత్రులపై ఎదురుదాడులు ప్రారంభించింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో సేవలు అందిస్తున్న ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ను కూడా ఇరాన్ వాడుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తాజాగా వెల్లడించింది. స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వాడుకుని అమెరికా బలగాలకు ఇరాన్ చుక్కలు చూపించినట్లు ఈ కథనం తెలిపింది. అయితే ఇరాన్ అధికారికంగా మాత్రం ఈ సేవల్ని వాడుకోలేదు. అనధికారికంగానే స్టార్ లింక్ సేవల్ని ఇరాన్ వాడుకున్నట్లు తెలిసింది.

Iran Turned Elon Musk s Starlink Into a Tool Against US Forces Washington Post Reports

బయటపెట్టిన వాషింగ్టన్ పోస్ట్

స్టార్ లింక్ ను ఇలా ఇరాన్ అనధికారికంగా వాడిన రెండు సందర్భాలను ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్ గుర్తించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఇరాన్ స్టార్ లింక్ శాటిలైట్ సేవను కమాండ్-కంట్రోల్ కోసం, అలాగే వన్-వే అటాక్ డ్రోన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. గత వేసవిలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కు సమర్పించిన ఇరాన్ వార్ రహస్య నివేదికలో ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం గురించి తెలిపింది. అయితే ఆ నివేదిక గురించి తమకు తెలియదని తాజాగా పెంటగాన్ చెప్పడం విశేషం.

Iran Turned Elon Musk s Starlink Into a Tool Against US Forces Washington Post Reports
మళ్లీ టారిఫ్ ల మోత మోగించబోతున్న ట్రంప్..! భారత్ సహా పలు దేశాలకు షాక్?
మళ్లీ టారిఫ్ ల మోత మోగించబోతున్న ట్రంప్..! భారత్ సహా పలు దేశాలకు షాక్?

ఎలాన్ మస్క్ ఆగ్రహం

కానీ తమ స్టార్ లింక్ సేవల్ని అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండూ వాడుకోవడంపై ఎలాన్ మస్క్ ఆగ్రహంగా ఉన్నారు. అమెరికా సైన్యం కూడా తమ ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగించడంపై స్పేస్‌ఎక్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భూమి మీద కార్యకలాపాల కోసం ఉద్దేశించిన సబ్‌స్క్రిప్షన్ కింద, స్పేస్‌ఎక్స్ సైనిక ఉపగ్రహ సేవ అయిన స్టార్‌షీల్డ్‌ను అమెరికా సైన్యం వన్-వే అటాక్ డ్రోన్‌లను నడపడానికి వాడటంపై మస్క్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ రెండు ఘటనలకు బాధ్యులైన ఇద్దరు స్పేస్‌ఎక్స్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అలాగే తనిఖీల్ని కూడా ముమ్మరం చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+