"కట్టప్పలం కాదు.. కట్ట బ్రహ్మన్నలం"..! రాహుల్ ట్వీట్ కు స్టాలిన్ కౌంటర్..!

కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంట్ ముందుకు తెస్తున్న కీలకకమైన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు తమిళనాడులో విపక్ష పార్టీ డీఎంకే చేసిన ప్రకటన ఇండియా కూటమిలో ప్రకంపనలు రేపుతోంది. గతంలో ఇదే డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ తో కలిసి వ్యతిరేకించిన డీఎంకే.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. డీఎంకే నిర్ణయంపై స్పందిస్తూ కట్టప్పలుగా విపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో విమర్శలు గుప్పించారు. దీనిపై ఇవాళ స్టాలిన్ ఘాటుగా స్పందించారు. డీలిమిటేషన్ బిల్లుకు స్టాలిన్ పార్టీ మద్దతునివ్వకుండా ఆపేందుకు ఇండియా కూటమి పార్టీల కీలక నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీతో పాటు అభిషేక్ బెనర్జీ, ఎంఏ బేబీ, ప్రణవ్ ఝా, కపిల్ సిబల్ వంటి వారు ఇవాళ తమిళనాడులోని ఆయన ఇంటికి వెళ్తున్నారు.

డీలిమిటేషన్ కాదు... విపక్షాల అసలు భయం జెర్రీ మాండరింగేనా? తాజా డిమాండ్లు..!
డీలిమిటేషన్ కాదు... విపక్షాల అసలు భయం జెర్రీ మాండరింగేనా? తాజా డిమాండ్లు..!

దీన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్ ను (MK Stalin) ఉద్దేశించి రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొద్ది సేపటి క్రితం ఓ ట్వీట్ చేశారు. ఇందులో రాహుల్.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని స్టాలిన్ ను డీఎంకేను అభ్యర్ధిస్తున్నట్లు తెలిపారు. సీట్ల సంఖ్యను 850కి పెంచడం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుందని, ఇది భారతదేశ ఎన్నికల పటాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లకు అపరిమితమైన అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. సోదరుడు స్టాలిన్ ఎల్లప్పుడూ తమిళ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఒక బండరాయిలా నిలబడ్డారని, జాతీయ ప్రయోజనాల కోసం, తమిళనాడు ప్రయోజనాల కోసం మరియు రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, మనమందరం కలిసి ఈ బిల్లును ఓడించాలని రాహుల్ కోరారు.

MK Stalin s Cryptic Reply to Rahul Gandhi History Will Judge Us as Kattabommans Not Ettappans
AP Delimitation: ఏపీలో కొత్తగా ఏర్పడే 88 అసెంబ్లీ సీట్లు- జిల్లాల వారీగా ప్రతిపాదనలు.!
AP Delimitation: ఏపీలో కొత్తగా ఏర్పడే 88 అసెంబ్లీ సీట్లు- జిల్లాల వారీగా ప్రతిపాదనలు.!

దీనిపై స్టాలిన్ ఘాటుగా స్పందించారు. నిన్న తమ పార్టీని కట్టప్పలుగా పేర్కొంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని, రాష్ట్రాల హక్కులను పరిరక్షించడంలో డీఎంకే పోషించిన చారిత్రక పాత్రను గుర్తించినందుకు సోదరుడు రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ స్టాలిన్ తెలిపారు. తాము తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ తమిళనాడు , తమ తమిళ ప్రజల ప్రయోజనాలనే ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకున్నామన్నారు.ఈ మార్గంలో తాము రాజీపడబోమన్నారు. చరిత్ర మమ్మల్ని కట్టబొమ్మన్‌లుగానే (వీర పాండ్య కట్టబ్రహ్మన్నలు) గుర్తిస్తుందని, ఎట్టప్పన్‌లుగా (కట్టప్పలు) కాదని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తద్వారా తన నిర్ణయం మారదని చెప్పకనే చెప్పేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+