ఏపీలో ఉద్రిక్తతల మధ్య పంచాయతీ పోలింగ్

ఏపీలో మలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్ కడప, అనంతపురం, సత్యసాయి, మార్కాపురం వంటి పలు జిల్లాల్లో చోటుచేసుకున్న వరుస దాడుల ఘటనలు ఉద్రేక పూరిత వాతావరణాన్ని సృష్టించాయి. అద్దంకి, దర్శి, కోవెలకుంట్ల, కమలాపురం, సింగనమల వంటి అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చోటుచేసుకున్నాయి.

పలు చోట్ల సాధారణ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ పరిధిలోని బల్లికురవ మండలం, ముక్తేశ్వరం గ్రామ పంచాయతీలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, పోలింగ్ ఏజెంట్లను అక్రమంగా నిర్బంధించారనే వార్తలు కలకలం రేపాయి.

Clashes erupt at various place during AP Panchayat Polls while Police stopped MP YS Avinash Reddy

తమకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతించాలని కోరుతూ కొందరు స్థానిక మహిళలు పోలీసుల కాళ్లను పట్టుకుని వేడుకోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు రాకుండా పోలీసులు స్వయంగా నియంత్రిస్తున్నారని పలువురు ఓటర్లు ఆరోపించినట్లు చెబుతున్నారు.

అలాగే దర్శి మండలం తానంచింతల గ్రామంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌ల్లోకి రాకుండా ప్రత్యర్థి వర్గాలు అడ్డుకున్నాయనే వార్తలు వెలువడ్డాయి. విధుల్లో ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని స్థానిక ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం వల్ల అనేకమంది సామాన్య ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రకాశం జిల్లా, ముండ్లమూరు మండలం ఉల్లగళ్ల పోలింగ్ కేంద్రంలోకి చొరబడి బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్తున్న వారిని ఓటర్లు అడ్డుకున్నారు. వారి చేతిలో నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాలెట్ పేపర్లను మీడియాకు చూపించారు. ఈ రెండు బూత్ లలో మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర అలజడి చెలరేగింది. ఓటు వేయడానికి వచ్చిన వారి చేతుల్లోని ఓటర్ స్లిప్పులను పోలీసుల సమక్షంలోనే లాక్కుని, వాటిని చింపివేసినట్లు చెబుతున్నారు. ఓ

అదే జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం పెట్నికోటలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వస్తున్న వైసీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ రాళ్ల దాడి జరిగిందని అంటున్నారు. పెట్నికోటలో చోటుచేసుకున్న ఈ హింసాత్మక ఘటనలను కవరేజ్ చేసేందుకు ప్రయత్నించిన విలేకరుల పట్ల కూడా కొందరు దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలుస్తోంది. దాడి దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న జర్నలిస్టుల ఫోన్లను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అదే మండలం ఉమ్మాయిపల్లి పోలింగ్ కేంద్రంలో పోలీసుల సహకారంతో రిగ్గింగ్‌ జరుగుతోందని వైసీపీ నాయకులు విమర్శించారు. కడప జిల్లాలో రాజకీయ నాయకుల కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం ఇన్‌ఛార్జ్ నరేన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వేంపల్లిలో సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హౌస్ అరెస్ట్‌ల పేరుతో ప్రజాప్రతినిధులను బయటకు రానివ్వకుండా అడ్డుకోవడంపై కడపలోని జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై వైసీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడారు. పోలీసులను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+