మనసు మార్చుకున్న మమత బెనర్జీ

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఒకట్రెండు ప్రతిపక్ష, తటస్థ పార్టీలు కూడా బిల్లు వైపే మొగ్గు చూపుతోన్నాయి. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్), డీఎంకే.. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయబోతోంది.

డీలిమిటేషన్ బిల్లు సోమవారం లోక్ సభ సమక్షానికి రాబోతోన్న నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమి ఇండియా తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. బుజ్జగింపులకు తెర తీసింది. విస్తృత స్థాయిలో రాజకీయ సమీకరణలను వేగవంతం చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్ తో వరుస భేటీలు నిర్వహిస్తోన్నారు. డీలిమిటేషన్ వైపు మొగ్గు చూపిన వారిని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తోన్నారు.

Mamata Banerjee changed her decision to attend India bloc meeting in Delhi discuss its strategy

ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష ఇండియా కూటమికి కొంత ఊరట లభించింది. డీలిమిటేషన్ బిల్లుపై జరిగే ఓటింగ్ కు దూరంగా ఉండాలని మొదట నిర్ణయించుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన మనసు మార్చుకున్నారు. ఇండియా బ్లాక్ ఏర్పాటు చేసిన అత్యవసర భేటీకి హాజరుకావాలని నిర్ణయించారు. బెంగాల్‌లో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనే నెపంతో మొదట కోల్‌కతాలోనే ఉండిపోవాలని ఆమె భావించారు.

ఖర్గే ఫైనల్ ట్రయల్స్: స్టాలిన్, శరద్ పవార్ ఇంటికి
ఖర్గే ఫైనల్ ట్రయల్స్: స్టాలిన్, శరద్ పవార్ ఇంటికి

కూటమి అగ్రనేతల నుంచి వరుసగా విజ్ఞప్తులు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్లమెంటరీ పార్టీ చీఫ్ అభిషేక్ బెనర్జీతో కలిసి ఆమె ఇండియా బ్లాక్ సమావేశానికి హాజరు కానున్నారు. స్టాలిన్, శరద్ పవార్ ను కలవడానికి మమతా బెనర్జీ కూడా చెన్నైకి బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు కోల్‌కతాలో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.

ఈ 11 నెలల్లో రూ. 68,000 తగ్గిన బంగారం ధర
ఈ 11 నెలల్లో రూ. 68,000 తగ్గిన బంగారం ధర

తన నియోజకవర్గంలో చోటుచేసుకుంటోన్న పరిణామాల దృష్ట్యా ఎక్కడికీ వెళ్లకూడదని మొదట నిర్ణయించుకున్నానని, ఇండియా కూటమి నేతల నుంచి వినతులు రావడం వల్ల ఢిల్లీ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ప్రతిపక్ష నేతలు తన కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని ఆఫర్ చేసినప్పటికీ.. ఆమె దానిని తిరస్కరించారు. ఎయిర్ ఇండియా విమానంలోనే ఆమె అభిషేక్ బెనర్జీతో కలిసి దేశ రాజధానికి బయలు దేరారు.

అలాగైతేనే మద్దతిస్తాం- ఆపై మీ ఇష్టం: కేంద్రానికి స్టాలిన్ క్లియర్ మెసేజ్
అలాగైతేనే మద్దతిస్తాం- ఆపై మీ ఇష్టం: కేంద్రానికి స్టాలిన్ క్లియర్ మెసేజ్

ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశంలో విపక్ష నేతలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత బిల్లుకు సంబంధించి పూర్తి ఎజెండా తెలుసుకున్న తర్వాతే తన తదుపరి స్పందన తెలియజేస్తానని మమతా బెనర్జీ వెల్లడించారు. సోమవారం ప్రారంభం అయ్యే సమావేశాల వేళ ప్రతిపక్షాల ఐక్యత ఏ విధంగా ఉండబోతోందనేది చర్చనీయాంశమౌతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+