AP Delimitation: ఏపీలో కొత్తగా ఏర్పడే 88 అసెంబ్లీ సీట్లు- జిల్లాల వారీగా ప్రతిపాదనలు.!
కేంద్ర పార్లమెంట్ లో వచ్చే వారం ప్రవేశపెట్టబోతున్న డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కూడా పెరగబోతున్నాయి. ఇలా పెరుగుతున్న అసెంబ్లీ సీట్ల జాబితాపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటికి డీలిమిటేషన్ కమిషన్ పరిశీలించి ఆమోద ముద్ర వేస్తే, ఈ కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు అమల్లోకి రావడం ఖాయం.
ఈ నేపథ్యంలో ఏపీలో డీలిమిటేషన్ (AP Delimitation) ప్రక్రియలో ప్రతీ జిల్లాలోనూ ప్రతిపాదిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను ఓసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో పలాస, ఇచ్చాపురం, అముదాల వలస నియోజకవర్గాల్లో విభజన జరిగి కనీసం ఒక్కో అదనపు సీటు కొత్తగా ఏర్పాటవుతుంది. అంటే ఈ జిల్లాలో మరో 3 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో బొబ్బిలి, ఎస్.కోట, చీపురుపల్లిని రెండుగా విభజించే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్ాలలో సాలూరు, పాలకొండను విభజిస్తారు. విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి, గాజువాక, భీమిని కనీసం రెండు లేదా మూడుగా విభజిస్తారు. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేటల్ని విభజించి కొత్త సీట్లు ఏర్పాటు చేస్తారు.

అల్లూరి జి్లలాలో పాడేరు, రంపచోడవరం, చింతపల్లిలో విభజనతో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం, తుని, పిఠాపురం ను విభజించి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. కోనసీమ జిల్లాలో కొత్తపేట, ముమ్మిడివరం, మండపేట నియోజకవర్గాల్లో విభజన ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, కొవ్వూరు, నిడదవోలును విభజిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెం, తణుకు, భీమవరం, ఏలూరు జిల్లాలో జంగారెడ్డి గూడెం, నూజివీడు, కైకలూరును విభజిస్తారు. కృష్ణా జిల్లాలో గుడివాడ, పెడన, అవగనిగడ్డను విభజించి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు.

ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, ఇబ్రహీం పట్నంలో, జగ్గయ్యపేటలో విభజన ఉంటుందని అంచనా. గుంటూరులో తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడులో, పల్నాడులో సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండలో, బాపట్లలో చీరాల, అద్దంకి, వినుకొండలో విభజన చేస్తారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరులో, నెల్లూరు జిల్లాలో కావలి, గూడూరు, ఆత్మకూరులో, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూలో విభజన ఉంటుంది. చిత్తూరు జిల్లాలో పలమనేరు, పుంగనూరు, కుప్పంలో, అన్నమయ్య జిల్లాలో మదనపల్లె, రాయచోటి, పీలేరులో విభజన చేస్తారు. కడపలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, సత్యసాయి జిల్లాలో హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, కర్నూలు జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్ద, బనగానపల్లె, ఆత్మకూరులో విభజన ఉంటుందని అంచనా.













Click it and Unblock the Notifications
