ఘోర అగ్నిప్రమాదం: నిద్రలోనే నలుగురి దుర్మరణం.. నాలుగు కుటుంబాల్లో తీరని విషాదం!

ఢిల్లీలోని విశ్వాస్ నగర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదం నాలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన ఇంటిలో ఉదయానికల్లా ఆర్తనాదాలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మృతులను మహేంద్ర, ఠాకూర్, అశోక్, సాదుగా గుర్తించారు. ఈ ఘటన వారి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కార్తిక దీపం అంటుకుని యువతి మృతి.. హైదరాబాద్ లో పెను విషాదం!
కార్తిక దీపం అంటుకుని యువతి మృతి.. హైదరాబాద్ లో పెను విషాదం!

మృతులంతా ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ వాసులు కాగా.. విశ్వాస్ నగర్‌లోని ఓ భవనంలో అద్దెకు ఉంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనం పైభాగంలోని బహిరంగ ప్రదేశంలో ఆరుగురు నిద్రిస్తున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో నిలిపి ఉంచిన ఈ-రిక్షాలను ఛార్జ్ చేసేందుకు విద్యుత్ ఏర్పాట్లు చేశారు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లో కింది భాగాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి.

Delhi Vishwas Nagar Fire Four Killed in E-Rickshaw Charging Blaze Two Seriously Injured Full Details

విద్యుత్ బోర్డు నుంచే మంటలు వ్యాపించినట్లు అనుమానం
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ-రిక్షాల ఛార్జింగ్ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు గ్రౌండ్ ఫోర్ మొత్తం వ్యాపించడంతో అక్కడ నిలిపి ఉంచిన నాలుగు ఈ-రిక్షాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కింద మంటలు, పొగ కారణంగా పైన నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

నలుగురు దుర్మరణం.. ఇద్దరి పరిస్థితి విషమం
బాధితులందరినీ డాక్టర్ హెడ్గేవార్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జీటీబీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. కొన్ని గంటల క్రితం వరకు సాధారణంగా ఉన్న ఆ ఇంటి వద్ద ఉదయం పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ వాహనాల సందడి కనిపించింది.

మృత్యుకీలలు.. బోల్తాపడిన ఇంధన ట్యాంకర్, 31 మంది దుర్మరణం!
మృత్యుకీలలు.. బోల్తాపడిన ఇంధన ట్యాంకర్, 31 మంది దుర్మరణం!

అద్దెదారుల వివరాల సేకరణ.. దర్యాప్తు
షాహదరా జిల్లా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ భవనంలో నివసిస్తున్న వారంతా అద్దెకు ఉంటున్న వారే కావడం గమనార్హం. పోలీసులు వారి గుర్తింపు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఈ-రిక్షాల ఛార్చింగ్ కోసం అమర్చిన ఎలక్ట్రిక్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఏ పరిస్థితుల్లో మంటలు చెలరేగాయో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలు, భద్రతా ఏర్పాట్లు లోపాలపై ఆరా తీస్తున్నారు.

చర్యలు చేపట్టిన పోలీసులు
డీసీపీ షాహదరా ఆర్పీ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం.. సమాచారం అందిన వెంటనే ఫర్ష్ బజార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరు క్షతగాత్రులు జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించి అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ.. మృతుల పూర్తి వివరాలను సేకరించే పని కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+