రిషభ్ షెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్.. మోటార్ సైకిల్ డైరీస్
కాంతారాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో.. రిషబ్ షెట్టి. ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ లో నటిస్తోన్నాడు. తాజాగా మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఆయన హోమ్ ప్రొడక్షన్ హౌస్ రిషభ్ ఫిల్మ్స్ దీన్ని తెరకెక్కించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇందులో భాగస్వామ్యం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రగతి రిషబ్ షెట్టి, సూర్యదేవర నాగవంశీ కలసి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రానున్న ఈ ఫిల్మ్ కోసం ఈ రెండు ప్రముఖ బ్యానర్లు చేతులు కలిపడం హాట్ టాపిక్ అయింది.
ఈ మూవీకి మోటార్ సైకిల్ డైరీస్.. అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి శివ చిరంతన దర్శకత్వం వహిస్తోన్నాడు. రిషభ్ షెట్టికి అత్యంత ఆప్తుడీ యంగ్ డైరెక్టర్. కాంతారా, కాంతారా చాఫ్టర్ 1కు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు. మొదటిసారి మెగాఫోన్ పట్టబోతోన్నాడు. ఓ ఫీల్ గుడ్ ట్రావెల్ డ్రామాగా చిత్రీకరణ జరుపుకోనుందీ సినిమా. ప్రయాణాలు, మనసులకు హత్తుకునే జ్ఞాపకాలు, జీవిత గమనాన్ని మార్చే వినూత్న అనుభవాల నేపథ్యంలో గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. స్టోరీ డెప్త్ ఏంటో దీన్ని చూసి తెలుసుకోవచ్చు. ఈ సినిమాలో నటించే ప్రధాన నటీనటులు ఎవరనేది ఇంకా రివీల్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ కు రిషబ్ షెట్టి సమర్పకుడిగా వ్యవహరిస్తోండటం హైప్ ఇచ్చింది. ప్రయాణంలో ఎదురయ్యే రకరకాల భావోద్వేగాలు, నూతన వ్యక్తులతో ఏర్పడే అనుబంధాలు, జీవితాన్ని కొత్త కోణంలో చూసేలా చేసే సంఘటనలను ఎంతో లోతుగా ఆవిష్కరించేలా దర్శకుడు ఈ కథను సిద్ధం చేశాడు.
జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ట్రావెల్ బేస్డ్ మూవీ కావడం వల్ల కెమెరా పనితనం అధికంగా ఉండే ఈ ఫిల్మ్ కు ఛాయాగ్రహణ బాధ్యతలను భువన్ రెడ్డి తీసుకున్నాడు. మోటార్ సైకిల్ డైరీస్ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Happy to join hands with @shetty_rishab garu for the production of this special film… #MotorcycleDiarys ❤️It’s a beautiful story and a journey close to our hearts 🏍️Excited to bring this one to you all. Hope you love it as much as we loved creating it! 🤗 https://t.co/ZJbuFA3hS0
— Naga Vamsi (@vamsi84) November 29, 2026
సాధారణంగా రోడ్ ట్రిప్స్, ప్రయాణాల నేపథ్యంలో వచ్చే సినిమాలకు యువత నుంచి ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ప్రయాణంలో లభించే కొత్త అనుభవాలు, ప్రకృతి అందాలు, జీవితంలో ఎదురయ్యే విభిన్న మలుపులను ప్రతిబింబించే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాలకు దగ్గరవుతాయి. బలమైన కథాంశంతో పాటు అత్యుత్తమ సాంకేతిక నిపుణుల కలయికలో రూపొందుతున్న మోటార్ సైకిల్ డైరీస్ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త దృశ్యకావ్యాన్ని అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications
