హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే కుల వివాదంలోకి లాగేశారు!

'ఆకాశంలో ఒక తార' సక్సెస్ ఈవెంట్‌లో మైత్రీ రవి చేసిన కామెంట్లు నూతన నటి సాత్విక వీరవల్లిని మరోసారి వార్తల్లో నిలిపాయి. ఆమె నటనను ప్రశంసిస్తూనే ఇటీవల ఆమె ఆడిషన్ ఇస్తున్నప్పుడు చూశానని రవి వెల్లడించారు. భవిష్యత్తులో ఆమె కెరీర్ లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

ఫస్ట్ రోజే బిగ్ షాక్..అన్నా నీ సినిమాకు ఇలాంటి పరిస్థితా..?
ఫస్ట్ రోజే బిగ్ షాక్..అన్నా నీ సినిమాకు ఇలాంటి పరిస్థితా..?

ప్రేక్షకుల మధ్య కూర్చున్న సాత్విక ఈ కామెంట్లకు నవ్వుతూ స్పందించడంతో రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్‌సీ17'లో ఆమె నటించబోతోందన్న ఊహాగానాలు వెంటనే మొదలయ్యాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఇండస్ట్రీలోనూ , సోషల్ మీడియాలోనూ చర్చ జోరుగా సాగుతోంది.

Actress Satvika Veeravalli Faces Caste Debate Amid RC17 Buzz Sparks Online Row Full Details Here

సోషల్ మీడియాలో అనవసర కుల చర్చ
అయితే ఈ చర్చ సోషల్ మీడియాలో అనవసరమైన, అభ్యంతరకరమైన మలుపు తిరిగింది. ఆమె నటన గురించి గానీ, భారీ ప్రాజెక్టుకు ఆమె సరిపోతుందా లేదా అన్న అంశం మీద గానీ కాకుండా కొందరు యూజర్లు ఆమె కులం, నేపథ్యాన్ని ఈ వివాదంలోకి లాగారు. ఆమె కమ్మ సామాజికవర్గానికి చెందినదని, అందుకే పెద్ద అవకాశాలు వస్తున్నాయని కొందరు ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ తాను తమిళ, అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయినని, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినదానినని సాత్విక గత ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు. వేర్వేరు వర్గాల ప్రజలు ఒకే ఇంటిపేరును ఉపయోగించుకోవడం వల్ల కులాన్ని నిర్ధారించలేమని స్పష్టమవుతోంది.

Alias Rukmini First Review: నితిన్ 'అలియాస్ రుక్మిణి' ఫస్ట్ రివ్యూ.. ఏడిపించేసాడు భయ్యా..!
Alias Rukmini First Review: నితిన్ 'అలియాస్ రుక్మిణి' ఫస్ట్ రివ్యూ.. ఏడిపించేసాడు భయ్యా..!

టాలెంట్‌ను కాదని కులంపై చర్చ సరికాదు..
కొత్తగా వచ్చిన నటీనటులకు పెద్ద అవకాశం లభించినప్పుడల్లా ఇలాంటి అనవసర వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. నటి యాక్టింగ్ స్కిల్స్, టాలెంట్‌ను చూడకుండా కులాన్ని లాగి తక్కువ చేసే కారణాలు వెతకడం సరికాదు. సాత్విక ఆ పాత్రకు సరిపోతుందా లేదా అని ప్రశ్నించడం సహజమే కానీ.. దానిలోకి కులాన్ని లాగడం హాస్యాస్పదం. ఆమె ఇప్పుడిప్పుడే కెరీర్‌ను ప్రారంభిస్తోంది. ఆమె విలువను అంచనా వేసే ముందు కనీసం ఆమె పనిని చూడనివ్వాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+