ఏటీఎం కార్డు ఉందా? అయితే ఆర్బీఐ తెచ్చిన ఈ కొత్త రూల్స్ మీకు తెలియాల్సిందే!

ఏటీఎంల నుంచి పదేపదే నగదు విత్‌డ్రా చేయడం, బ్యాలెన్స్ తనిఖీ చేయడం వల్ల వినియోగదారులపై బ్యాంకింగ్ ఛార్జీల భారం పెరుగుతోంది. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత చేసే లావాదేవీలకు భారీగా రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఉచిత పరిమితి ముగియగానే బ్యాంకులు తప్పనిసరిగా ఖాతాదారులకు అలర్ట్ పంపాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

డిసెంబర్ లో బ్యాంకులకు సెలవు రోజులు ఇవే
డిసెంబర్ లో బ్యాంకులకు సెలవు రోజులు ఇవే

2008-2022 సర్క్యులర్ల విలీనం.. తక్షణ అమలు
నవంబర్ 27న ఏటీఎంలు, పాయింట్-ఆఫ్-సేల్(పీవోఎస్) టెర్మినళ్ల ద్వారా నగదు విత్‌డ్రాకు సంబంధించి ఆర్బీఐ సమగ్ర ఆదేశాలు జారీ చేసింది. 2008 నుంచి 2022 మధ్య కాలంలో విడుదల చేసిన 17 పాత సర్క్యులర్లను కలిపి ఒకే మార్గదర్శకంగా రూపొందించింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. లావాదేవీల రుసుములు, ఉచిత విత్‌డ్రా పరిమితులపై ఖాతాదారులకు మరింత పారదర్శకత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.

RBI ATM Rules Update Mandatory Alerts After Free Limit Ends Fee Caps and Savings Tips Full Details Here

ఏటీఎం ఛార్జీల భారం ఎలా పెరుగుతుంది?
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయ్యాక బ్యాంకులు ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.23 వరకు రుసుము విధించవచ్చు. దీనిపై 18 శాతం జీఎస్టీ కలిపితే ఒక్కో లావాదేవీకి గరిష్ట ఛార్జీ రూ.27.14 అవుతుంది. నెలకు 5 అదనపు చార్జబుల్ లావాదేవీలు చేస్తే నెలకు రూ.135.70 చొప్పున ఏడాదికి రూ.1,628.40 చెల్లించాల్సి వస్తుంది. నెలకు 10 అదనపు లావాదేవీలు చేస్తే ఏడాదికి ఈ ఖర్చు రూ.3,256.89 వరకు చేరుతుంది.

బ్లాక్ ఫ్రైడే సేల్‌ లో షాపింగ్.. ఇలా చేయకపోతే మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ..!
బ్లాక్ ఫ్రైడే సేల్‌ లో షాపింగ్.. ఇలా చేయకపోతే మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ..!

ఖాతాదారులకు ఎలా ప్రయోజనం?
ఇప్పటివరకు ఎన్ని ఉచిత లావాదేవీలు పూర్తయ్యాయి. ఆ తర్వాత చేసే లావాదేవీలకు ఎంత ఛార్జీ పడుతుందనే వివరాలను ఖాతాదారులకు స్పష్టంగా తెలియజేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. సాంకేతిక లోపాలు, ఏటీఎంలో నగదు లేకపోవడం, తప్పు పిన్ లేదా బ్యాంకు సంబంధిత సమస్యల వల్ల విఫలమైన లావాదేవీలకు ఎటువంటి రుసుము వసూలు చేయకూడదు. వాటిని ఉచిత లావాదేవీల పరిమితిలోనూ లెక్కించకూడదు. విత్ డ్రా పరిమితులు, వర్తించే రుసుములు, ఉచిత లావాదేవీల హక్కులను బ్యాంకులు స్పష్టంగా ప్రదర్శించాలి. తద్వారా పరిమితి ముగియగానే వినియోగదారులు అప్రమత్తమై అనవసర ఛార్జీలను నివారించవచ్చు.

ఏటీఎం ఖర్చులను తగ్గించుకునే మార్గాలు
ఖాతాదారులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అదనపు ఛార్జీలను సులభంగా తగ్గించుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల కంటే సొంత బ్యాంకు ఏటీఎంలను ప్రాధాన్యతగా ఉపయోగించాలి. ఇంటి అవసరాలకు తగ్గట్టుగా నగదు విత్‌డ్రాను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. బ్యాలెన్స్ తనిఖీ, అకౌంట్ స్టేట్‌మెంట్ల కోసం ఏటీఎంలకు బదులుగా మొబైల్ బ్యాంకింగ్ లేదా యాప్‌లను వాడాలి. అర్హత కలిగిన మర్చంట్ పాయింట్-ఆఫ్-సేల్(పీవోఎస్) టెర్మినళ్ల ద్వారా ఒక్కో లావాదేవీకి రూ.2,000 వరకు నెలకు గరిష్టంగా రూ.10,000 వరకు నగదు తీసుకోవచ్చు. వీటిపై ఛార్జీ పడితే విత్ డ్రా మొత్తంలో గరిష్టంగా ఒక శాతం వరకు మాత్రమే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+