దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె- ఆ రోజే- ఐడీబీఐ ఉద్యోగులకు మద్దతుగా..!

ఐడీబీఐ వాటాల విక్రయంతో పాటు బ్యాంకుపై నియంత్రణను విదేశీ సంస్థకు బదిలీ చేయాలన్న నిర్ణయాలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో గుజరాత్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఐడీబీఐ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే వీరికి మద్దతుగా ఇప్పుడు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సైతం సమ్మెలోకి (Bank Strike) దిగబోతున్నాయి. ఈ మేరకు ఐడీబీఐ ఉద్యోగులకు వారు పూర్తి సంఘీభావం ప్రకటించారు. దీంతో డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.

AP 12th PRC: ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విధివిధానాల విడుదల..! డెడ్ లైన్ ఇదే..!
AP 12th PRC: ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విధివిధానాల విడుదల..! డెడ్ లైన్ ఇదే..!

ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు మద్దతుగా డిసెంబర్ 3న సమ్మె చేపట్టబోతున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వంటి సంఘాలు ప్రకటించాయి. ఐబీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం వాటాతో పాటు ఎల్ఐసీకి ఉన్న 60.72 శాతం వాటాను సైతం కెనడాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ సంస్థకు విక్రయించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ పరిశీలించి, అనుమతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆర్బీఐపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్లు తెలుస్తోంది.

December 3 Bank Strike Banking Unions Rally Behind IDBI Employees
Central Government Employees:
Central Government Employees:

లాభాల్లో ఉన్న ఐడీబీఐని ప్రైవేటుకు అప్పగించడం చట్ట విరుద్దంగా పేర్కొంటున్న బ్యాంకు ఉద్యోగుల సంఘాలు.. ఇది పూర్తయితే భవిష్యత్తులో ఇలాగే తమ బ్యాంకుల్ని కూడా విదేశీ పరం చేస్తారన్న భయాల్ని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో డిసెంబర్ 3న సమ్మె చేపట్టడం ద్వారా కేంద్రం, ఆర్బీఐపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సమ్మెకు సన్నాహకంగా రేపు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతున్నారు. ఈ నెల 27న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని, 28న సోషల్ మీడియాలో దీనిపై పోస్టులు పెడతామని, 30న కేంద్రమంత్రికి వినతిపత్రం ఇస్తామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీంతో ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను ఇతర బ్యాంకులు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాయో అర్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+