Central Government Employees: "నాలుగేళ్ల తర్వాత ల్యాప్ టాప్ మీదే.."- ఉద్యోగులకు కేంద్రం బంపర్ ఆఫర్..!

కేంద్ర ప్రభుత్వ అధికారులకు (Central Government Employees) ఓ గుడ్ న్యూస్. ఆఫీసు అవసరాల కోసం ప్రభుత్వం ఇచ్చే ల్యాప్ టాప్ ల విషయంలో కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. వీటి ప్రకారం ఇకపై కేంద్రం ఇచ్చే ల్యాప్ టాప్ లను నాలుగేళ్ల తర్వాత తమ వద్దే ఉంచుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలోనూ నిబంధనల్ని సడలించారు. దీంతో ఉద్యోగులకు వీటి వాడకం, నిర్వహణ విషయంలో ఊరట కలగబోతోంది.

ఏపీ ఉద్యోగులకు రెండో శనివారం సెలవుపై సర్కార్ క్లారిటీ..! నవంబర్ 14న..!
ఏపీ ఉద్యోగులకు రెండో శనివారం సెలవుపై సర్కార్ క్లారిటీ..! నవంబర్ 14న..!

తాజా నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు అవసరాల కోసం ఇచ్చే ల్యాప్ టాప్స్ ను నాలుగేళ్ల తర్వాత ఎలాంటి డబ్బూ చెల్లించకుండానే తీసేసుకోవచ్చు. ఈ మేరకు ఆర్ధిక శాఖ తమ ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు విధానంలో సవరణలు చేసింది. దీని ప్రకారం అర్హులైన కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చే ల్యాప్ టాప్ లతో పాటు ట్యాబ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను సైతం నాలుగేళ్ల తర్వాత సొంతానికి తీసేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వానికి పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. నాలుగేళ్ల తర్వాత ల్యాప్ టాప్ లు తీసేసుకున్నా.. వాటిలో స్టోర్ అయిన సమాచారం మాత్రం పూర్తిగా తొలగించాలి. నాలుగేళ్ల కంటే ముందు రిటైర్ అయ్యే వారు వాటిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.

Good News for Central Government Employees Keep Office Laptops After Four Years
AP Govt: ఉద్యోగుల e-SRపై ప్రభుత్వం కీలక నిర్ణయం- ఇకపై ఆ రికార్డులన్నీ..!
AP Govt: ఉద్యోగుల e-SRపై ప్రభుత్వం కీలక నిర్ణయం- ఇకపై ఆ రికార్డులన్నీ..!

అలాగే పన్నులు కాకుండా రూ. 1.8 లక్షల విలువ కలిగిన ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ విభాగాలకు కూడా ఇందులో వీలు కల్పించారు. ఇందులో ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్, ప్రొ మోడళ్లు కూడా తీసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే 1.8 లక్షల గరిష్ట ధరకు అర్హత పొందాలంటే ఒక పరికరంలో 40 శాతం పైగా మేక్ ఇన్ ఇండియా కంటెంట్ ఉండాలని షరతు పెట్టారు. ఇతర పరికరాలకు గరిష్టంగా రూ.1.5 లక్షల ధర వరకూ అనుమతిస్తున్నారు. ఈ రెండు కేటగిరీల్లోనూ ప్రామాణిక సాఫ్ట్ వేర్ ఎలాగో ఉంటుంది. గతంలో జూలై 2023న జారీ చేసిన నిబంధనల్ని సవరిస్తూ తాజాగా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. తాజా విధానం ప్రకారం మంత్రిత్వశాఖలతో పాటు విభాగాలు అధికారులకు ఆఫీసు పనుల కోసం ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్స్, నోట్ ప్యాడ్స్, అల్ట్రా బుక్స్, నోట్ బుక్స్ వంటి పరికరాలను జారీ చేయవచ్చు. పే లెవెల్ 12, అంతకంటే ఎక్కువ స్దాయి అధికారులు వీటికి అర్హులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+