సరదాగా స్కూల్ పిక్నిక్ కు వెళ్లిన బాలుడు.. ఊయల తగిలి.. తీవ్ర విషాదం..
అప్పటివరకూ ఎంతో సరదాగా.. హుషారుగా సాగిన స్కూల్ పిక్నిక్ లో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా ఆ స్కూల్ పిక్నిక్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లోటస్ పాండ్ పార్క్ లో ఈ విషాదకరమైన ఘటన జరిగింది.
ఈ అనుకోని ప్రమాదంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఎంతో సరదాగా పిక్నిక్ వెళ్లిన తమ కుమారుడు ఇలా విగతజీవిగా తిరిగిరావడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే తమ కుమారుడి ప్రాణాలు తీసిందని మండిపడుతున్నారు. ఇక స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి వారితో పిల్లలను పిక్నిక్ కు పంపిస్తే ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని స్కూల్ పేరెంట్స్ నిలదీస్తున్నారు.
హైదరాబాద్ మొయినాబాద్లో స్కూల్ పిక్నిక్లో విషాదం.. ఇనుప ఉయ్యాల తగిలి 10 ఏళ్ల విద్యార్థి మృతి, మరొకరికి గాయాలు.!#Hyderabad #Moinabad #SchoolPicnic #StudentDeath #Telangana #ViralWatch #OITelugu https://t.co/5bcR94yGF1
— oneindiatelugu (@oneindiatelugu) November 24, 2026
ఏం జరిగింది..?
హైదరాబాద్ నగరంలోని హ్యాపీ స్కాలర్స్ స్కూల్ యాజమాన్యం.. మొయినాబాద్ లోని లోటస్ పాండ్ పార్క్ కు పిల్లలను పిక్నిక్ కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారీ ఇనుప ఊయలపై సుమారు 10 మంది పిల్లలు ఎక్కారు. వెనుక నుంచి మరో నలుగురు విద్యార్థులు ఆ ఊయలను అత్యంత వేగంగా ఊపుతూ ఆడుకున్నారు. అయితే బరువుకు ఆ ఊయల ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా వెనక్కి దూసుకొచ్చిన ఇనుప ఊయల అక్కడే ఉన్న ఇద్దరు చిన్నారులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అభిరామ్ అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో బాలుడు యశ్వంత్ కు తీవ్రంగా గాయాలయ్యాయి.

అయితే అంత భారీ ఊయలపై పది మంది విద్యార్థులు కూర్చోగా మిగతా నలుగురు దాన్ని వేగంగా ఊపుతుంటే.. కనీసం స్కూల్ కు చెందిన ఒక్క టీచర్.. సిబ్బంది అక్కడ లేకపోవడంతో.. ఊయల వేగాన్ని వాళ్లు అంచనా వేసే వయసు కాకపోవడంతో ముందుకు వెళ్లిన ఉయ్యాల అంటే వేగంగా వెనక్కి వచ్చి అత్యంత బలంగా ఢీకొట్టినట్లు సమాచారం అందుతోంది. ఇక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ మృతుడి తండ్రి ఆరోపించారు. సరైన భద్రతా చర్యలు, పర్యవేక్షణ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి వారితో పిల్లలను పిక్నిక్ కు పంపిస్తే ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని స్కూల్ పేరెంట్స్ నిలదీస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
