తెలంగాణాలో పలు జిల్లాలకు వర్ష సూచన.. బంగాళాఖాతం ద్రోణి హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో కూడా వాతావరణం మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు తూర్పు గాలుల ద్రోణి విస్తరించడం, అలాగే కొమొరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వైపు మరో ద్రోణి కొనసాగడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణాకు వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో కూడా నవంబర్ 24, 25 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఈ రెండు రోజులకు రాష్ట్రంలో ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. నవంబర్ 26 నుంచి తెలంగాణలో తిరిగి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి.

అయితే ముఖ్యంగా వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కోతకు వచ్చిన పంటలు, ఆరుబయట ఆరబెట్టిన ధాన్యాన్ని తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు నిదానంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో. నవంబర్ 26 నుండి వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా పొడి, చల్లని పరిస్థితులు నెలకొంటాయి. ఇదిలా ఉంటే తెలంగాణా వ్యాప్తంగా చలి బాగా పెరిగింది. తెలంగాణాలో వాతావరణం చాలా వరకు పొడిగా ఉంటుంది, అక్కడక్కడా తక్కువ వర్షం పడే అవకాశం ఉంది. కేవలం పది శాతం మాత్రమే వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు29°C-30°Cమరియు తేలికపాటి తూర్పు గాలులు వీస్తాయి.
ఇదిలా ఉంటే ఖమ్మం మరియు కరీంనగర్ .పగటి ఉష్ణోగ్రతలు సుమారు29°C-30°C, ఖమ్మం సమీపంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ & నిజామాబాద్ .సాధారణంగా పొడిగా, ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు25°C నుండి 29°C వరకు ఉండే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
