అప్పుడే ఓటీటీలోకి సూర్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో చెలరేగిపోతున్నారు. ఇటీవలికాలంలో ఏ స్టార్ హీరోకూ సాధ్యం కాని విధంగా ఏడాదికి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఒకెత్తు అయితే ఆ మూడూ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం మరో ఎత్తు. ఈ ఏడాది మూడు నెలలకో బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపారు సూర్య. ఈ ఏడాది ఏప్రిల్ లో 'కరుప్పు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. ఈ చిత్రానికి ఆర్ జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించారు. కరుప్పు మూవీకి దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. సూర్యకు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా కరుప్పు నిలిచింది. ఈ మూవీ తెలుగులోనూ 'వీరభద్రుడు' అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.
ఇక ఆ తర్వాత సూర్య ఆగస్టులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే మూవీతో వచ్చారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూవీకి టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మలయాళి ముద్దుగుమ్మ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ ను అందుకుంది. ఇలా వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న నేపథ్యంలో సూర్య ఫుల్ జోష్ లో ఇటీవల మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే 'సీన్'.. దీపావళి కానుకగా నవంబర్ 6 న ఈ మూవీ విడుదలైంది. సీన్ మూవీ ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

అయితే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన సీన్ మూవీ థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. డిసెంబర్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని తమిళం, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో విడుదల కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఓటీటీలో చూసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
