టూరిస్టు బస్సు బోల్తా.. 12 మంది మృతి.. 10 మందికి సీరియస్

హంగేరీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ టూరిస్టు బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం ఎమ్ 3 మోటర్ వే, మేజోకెర్జ్సెట్ లో జరిగింది. టూరిస్టు బస్సు నైరేగిజాహా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు హంగేరియన్ పోలీసులు తెలిపారు. ఈ బస్సు రోడ్డు భాగాన్ని వదిలి లోయలో పడినట్లు వివరించారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనా సమయంలో ఈ బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారని సమాచారం. ఈ విషయాన్ని హంగేరీ ప్రభుత్వ వార్తా సంస్థ ఎంటీఐ నివేదించింది.

ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన సహాయక బృందాలు గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించాయి. ఈ ఘటనపై పోలీసులు డ్రైవర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనలో 12 మంది టూరిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలిష్ అధ్యక్షుడు కరోల్ నవ్ రోకీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఈ ఘటనలో ఇంత మంది టూరిస్టులు చనిపోవడం తనకు బాధాకరం అని తెలిపారు. మరోవైపు పోలిష్ విదేశాంగ మంత్రి రాడోస్లా సికోర్స్కీ ఈ ఘటనను తీవ్ర బాధాకరమైనదిగా అభివర్ణించారు. ఈ ఘటనపై హంగేరియన్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు.

Hungary Tourist bus overturns in Hungary 12 dead 10 critically injured Tourist bus overturns news

డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగినట్లు స్పష్టం చేశారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ఈ ఘటనకు గల నిజమైన కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పోలిష్ అధ్యక్షుడు కరోల్ నవ్ రోకీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+