మహిళలు దాడి చేస్తే డబుల్ క్యాష్ రివార్డ్.. యూఎస్ ఆర్మీపై ఇరాన్ సంచలన స్కెచ్!

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. అగ్రరాజ్యం ఆధిపత్యానికి ఏమాత్రం తలవంచని ఇరాన్, ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. రంగంలో ఉన్న అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా హతమార్చినా భారీ రివార్డు అందిస్తామని ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. ఈ ఆఫర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే.. ఈ సాహస కార్యాన్ని మహిళలు పూర్తి చేస్తే వారికి రెట్టింపు బహుమతి ఇస్తామని ప్రకటించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.

ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్ఏ (IRNA) వివరాల ప్రకారం.. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ సంచలన పథకాన్ని వెల్లడించారు. ఆక్రమణలకు పాల్పడుతున్న అమెరికా సైనికులను బంధించి అప్పగించినా లేక మట్టుబెట్టినా ఇరాన్ సైన్యం తరఫున 30,000 డాలర్లు (ఇరాన్ కరెన్సీలో దాదాపు 5 బిలియన్ తోమాన్లు) రివార్డుగా అందిస్తామని చెప్పారు. ఇదే పనిని ఇరాన్‌కు చెందిన ధైర్యవంతులైన మహిళలు సాధిస్తే వారికి డబుల్ ధమాకాగా రెట్టింపు బహుమతిని అందజేస్తామని స్పష్టం చేశారు. అమెరికాపై పోరాటంలో ఆర్థికంగా భాగస్వాములు కావాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Iran Army Offers Huge Cash Reward to Target US Soldiers with Special Double Bounty Bonus for Iranian Women
US-Iran War: ట్రంప్ కు ఇరాన్ ఘాటు కౌంటర్ - అవన్నీ ఆయన భ్రమలే..!
US-Iran War: ట్రంప్ కు ఇరాన్ ఘాటు కౌంటర్ - అవన్నీ ఆయన భ్రమలే..!

ఫిబ్రవరి నుంచి రగులుతున్న యుద్ధ జ్వాలలు!

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇస్రాయెల్ దళాలు టెహ్రాన్ సమీపంలో జరిపిన దాడులతో ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పటి నుంచి పశ్చిమాసియా ప్రాంతంలో ఇరుదేశాల మధ్య ఘర్షణలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేయడం, అంతర్జాతీయంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇరాన్‌కు బిగ్ షాక్: హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ప్రకటన!
ఇరాన్‌కు బిగ్ షాక్: హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ప్రకటన!

సైకో వార్‌ఫేర్‌కు ఇరాన్ తెరతీసిందా?

ప్రస్తుతం దక్షిణ ఇరాన్, హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొనగా, యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ కూడా ఎర్రసముద్రంలో నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. గత ఏప్రిల్‌లో ఒక అమెరికన్ పైలట్‌ను రక్షించే ప్రక్రియ మినహా ఇరాన్ భూభాగంలో ప్రత్యక్షంగా అమెరికా సైనిక బలగాలు లేనప్పటికీ, ఇరాన్ సైన్యం ప్రకటించిన ఈ భారీ రివార్డు అమెరికా బలగాల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే పెద్ద వ్యూహంగానే అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+