UAE లో దాడులపై కీలక వార్నింగ్.. పౌరులకు ప్రకటన జారీ..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇరాన్- అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో యూఏఈ తమ దేశ పౌరులను అలర్ట్ చేసింది. మిసైల్ దాడులకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలంతా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు యూఏఈ కు చెందిన ది నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(NCEMA) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. తమ దేశానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఓ క్షిపణి యూఏఈ టార్గెట్ గా వచ్చిందని పేర్కొంది.

60 రోజుల పాటు ఇరాన్- అమెరికా మధ్య ఉన్న అవగాహన ఒప్పందం ముగిసిన నేపథ్యంలో యూఏఈ పై క్షిపణి బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మేరకు యూఏఈ ఇంటీరియర్ మినిస్ట్రీ ఫోన్ అలెర్ట్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. సురక్షిత ప్రాంతంలో ఉండండి.. అంటూ తమ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్ లో పోస్టు పెట్టారు. అందులో అమెరికా కొత్త భూభాగం హార్మూజ్ జలసంధి అని పోస్టు చేశారు. హార్మూజ్‌ జలసంధిపై పూర్తిగా నియంత్రణ తమకే ఉందని ట్రంప్‌ స్పష్టం చేశారు. జూన్‌ లో ఇరాన్ తో కుదిరిన 60 రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించాలంటే వెంటనే ఇరాన్ తెల్ల జెండా ఎగరేసి లొంగిపోవాలని ట్రంప్ అన్నారు.

WestAsia Tensions in Critical warning regarding attacks in the UAE Advisory issued to citizens

ఇరాన్- అమెరికా మధ్య ఉన్న అవగాహన ఒప్పందం ఆగస్టు 17 తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న అమెరికా స్థావరాలను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ మెసేజ్‌ లో స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+