రైతుల నోట్లో మట్టి కొట్టే కేంద్ర నిర్ణయం - మంత్రి తుమ్మల ఆగ్రహం!

కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించిన నిర్ణయంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఆయిల్ పామ్ రైతుల నోట్లో మట్టి కొట్టినట్టుగా ఉందని ఆయన మండిపడ్డారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ, మరోవైపు విదేశీ పామాయిల్‌పై సుంకం తగ్గించడం కేంద్రం ద్వంద వైఖరికి స్పష్టమైన ఉదాహరణ అని విమర్శించారు.

క్రూడ్ పామ్ ఆయిల్‌పై మొత్తం దిగుమతి సుంకం 16.5 శాతం నుంచి 11శాతానికి తగ్గినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. దీనివల్ల దిగుమతి అయ్యే పామాయిల్‌కు పోటీ ప్రయోజనం పెరిగి, దేశీయంగా ఆయిల్ పామ్ గెలల ధరలపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతును ఆయిల్ పామ్ సాగు చేయమని ప్రోత్సహిస్తూ, అదే సమయంలో విదేశీ నూనెకు మార్కెట్‌ను సులభతరం చేయడం ఏ రకమైన రైతు అనుకూల విధానమన్నారు.

Telangana Minister Tummala Nageswara Rao Slams Centre for Cutting Import Duty on Palm Oil says it hurts farmers

ఆయిల్ పామ్ సాధారణ సీజనల్ పంట కాదని, రైతు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టి, నీరు, ఎరువులు, నిర్వహణ ఖర్చులు భరిస్తూ సాగు చేసే దీర్ఘకాలిక పంట అని మంత్రి తుమ్మల వివరించారు. ఇలాంటి పంటకు మార్కెట్ ధరపై స్థిరత్వం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు.

తెలంగాణలో ప్రస్తుతం సుమారు 3.20 లక్షల ఎకరాల్లో 88 వేలకు పైగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, దేశంలో ఈ పంట విస్తీర్ణంలో రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపారు.
రైతులను ఈ పంట వైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీలు, నాట్ల విస్తరణ, డ్రిప్ ఇరిగేషన్, ప్రాసెసింగ్ యూనిట్లు, రిఫైనరీలు వంటి అనేక చర్యలు చేపడుతోందని గుర్తు చేశారు.

కేంద్రం కూడా NMEO-OP పథకం ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచి వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని చెబుతోందని, కానీ అమలులో మాత్రం వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. తాజా ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ.25,000 కనీస హామీ ధర కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని మంత్రి తుమ్మల చెప్పారు.

మేడారం మినీ జాతర 2027.. షెడ్యూల్ ఇలా..సమ్మక్క భక్తులకు అలెర్ట్!
మేడారం మినీ జాతర 2027.. షెడ్యూల్ ఇలా..సమ్మక్క భక్తులకు అలెర్ట్!

భారత్ వంట నూనెల అవసరాల్లో సుమారు మూడింట రెండొంతులు దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ సాగును బలోపేతం చేయడం రైతు సంక్షేమంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడటం కాదు, దేశీయ రైతు ఉత్పత్తిని పెంచడమేనని స్పష్టం చేశారు.

రైతు ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడదని, కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి దేశీయ ఆయిల్ పామ్ రైతులకు రక్షణ కల్పించే విధానం తీసుకురావాలని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+