సీఎం ఇంటిని కూల్చేసిన అధికారులు.. ఏం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్ లో 2028లో జరిగే సింహస్థ మహాకుంభమేళా కోసం ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనులు గత కొన్ని రోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉజ్జయినిలోని సీఎం మోహన్ యాదవ్ పూర్వికుల ఇంటిని అధికారులు కూల్చేశారు. ఈ మేరకు ఈ కార్యక్రమాన్ని స్వయంగా సీఎం ప్రారంభించారు. ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా అడ్డుగా ఉన్న మొత్తం 272 కట్టడాలను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇందులో సీఎం మోహన్ యాదవ్ పూర్వికుల ఇళ్లు కూడా ఉంది. అయితే ఆ ఇంటిని కూల్చేందుకు అధికారులు వెనకాడడంతో స్వయంగా సీఎం మోహన్ యాదవ్ గునపంతో తొలి దెబ్బ ఇంటి ముందు గడప వద్ద కొట్టి కూల్చివేత పనులను ప్రారంభించారు. అంతకుముందు ఇంట్లో పూజలు నిర్వహించారు. అయితే తన చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న ఇల్లు కావడంతో ఒకింత సీఎం భావోద్వేగానికి గురయ్యారు. కానీ రోడ్డు విస్తరణ, సమాజ హిత కోసం ఇలాంటివి తప్పవని స్పష్టం చేశారు.

ఇక సింహస్థ మహాకుంభమేళాలో భాగంగా ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు ప్రజలు ఈ రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని సీఎం మోహన్ యాదవ్ కోరారు. వచ్చే సింహస్థ మహాకుంభమేళా పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఇక ఉజ్జయినిలో సీఎం ఇల్లు ఆయన తండ్రి పూనమ్ చంద్, అంకుల్ శంకర్ లాల్ పేర్లమీద రిజిస్టర్ అయి ఉంది. శంకర్ లాల్ కుటుంబం ఈ ఇంట్లోనే నివసిస్తుండగా.. సీఎం సోదరి కళావతి యాదవ్ కు సెపరేట్ గా ఇల్లు ఉంది. ఇక సీఎం తాత శ్రీ రామ చంద్ర 1974లో ఈ ఇంటిని నిర్మించారు.

MohanYadav CM officials have demolished the ancestral home of cm for the Simhastha Maha Kumbh Mela

ఉజ్జయినిలో రానున్న మహాకుంభమేళాలో భాగంగా 500 కిలోమీటర్ల వరకు రోడ్లను విస్తరించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగానే సీఎం ఇంటిని అధికారులు కూల్చేశారు. అయితే తన ఇంటిని కూల్చడంపై సీఎం ఎలాంటి నష్టపరిహారం ఆశించలేదు. ఈ ప్రాంతంలో కూల్చివేతలతో తమ ఇళ్లను కోల్పోయిన 271 మంది బాధితులకు స్థానిక కలెక్టర్ ఆదేశాల మేరకు నష్టపరిహారం అందనుంది. ఇక ఉజ్జయిని కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్- జులై వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఉజ్జయిని నగరంలోని ప్రాచీన ఖడే హనుమాన్ ఆలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో హనుమాన్ విగ్రహాన్ని జేసీబీలు, క్రేన్లతో లాగినా అక్కడి నుంచి ఇంచు కూడా విగ్రహం కదల్లేదన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+