రోడ్డు నాణ్యత లేదన్నందుకు యువకుడి చెంప పగులగొట్టిన మంత్రి.. వీడియో వైరల్

దేశ రాజధాని దిల్లీలోని తిలక్ నగర్ లో రోడ్డు మరమ్మతు పనుల తనిఖీలో భాగంగా పీడబ్ల్యూ మంత్రి పర్వేశ్ వర్మ.. పక్కనే ఉన్న ఓ యువకుడి చెంప పగులగొట్టిన ఘటన ఇప్పుడు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదం అయింది. తిలక్ నగర్ లోని రోడ్డు తనిఖీల్లో భాగంగా స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నెయిల్ సింగ్ కు దిల్లీ మంత్రి పర్వేశ్ వర్మకు మధ్య మాటల వాగ్వాదం చెలరేగింది. రోడ్డు పనుల్లో నాణ్యత విషయంలో ఇరు వర్గాల మధ్య వాదనలు నడుస్తుండగా ఆప్ ఎమ్మెల్యే జర్నెయిల్ సింగ్ అనుచరుడు అయిన ఓ యువకుడు మంత్రి పర్వేశ్ వర్మను ఫోన్ లో వీడియో తీస్తుండగా ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఆయన యువకుడి చెంప చెల్లుమనిపించాడు. యువకుడి వద్ద నుంచి ఫోన్ లాక్కొని మరీ దాడి చేశారు మంత్రి పర్వేశ్ వర్మ. దాంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య కాస్త తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఈ ఘటన సమయంలో మంత్రి తీరుపై అక్కడి కార్యకర్తలు పలు రకాలుగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారి మాటలు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. అతడ్ని ఎలా కొడతారు అని ఆ జనంలోంచి ఓ కార్యకర్త అరిచాడు. ఓ.. అతడ్ని కొట్టేశాడు.. చూడండి అంటూ మరో కార్యకర్త మాటలు వినిపిస్తున్నాయి. మరో వ్యక్తి.. ఏమైంది కనిపించడం లేదు అన్న వాయిస్ వినిపిస్తోంది. ఇంకో కార్యకర్త మాట్లాడుతూ.. కామన్ మ్యాన్ ను ఎవరూ కొట్టడానికి రైట్ లేదు అని అన్నాడు. ఇక తిలక్ నగర్ లోని రోడ్డు పనులను తనిఖీ చేసేందుకు మంత్రి పర్వేశ్ వర్మ, ఆప్ ఎమ్మెల్యే జర్నెయిల్ సింగ్ అక్కడకు రావడంతో తప్పు మీదంటే.. మీదని ఇరు వర్గాల మధ్య నినాదాలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోడ్డు పనులు బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగాయని నాణ్యత లేవని ఆప్ ఎమ్మెల్యే జర్నెయిల్ సింగ్ నిరసన వ్యక్తం చేశారు.

ParveshVerma Delhi Minister Minister slaps AAP worker Altercation between AAP MLA JarnailSingh row

మరోవైపు మంత్రి చేతిలో గాయపడ్డ యువకుడు సాహిబ్ మాట్లాడుతూ.. తిలక్ నగర్ లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. ఇటీవల వేసిన రోడ్డులో నాణ్యత లేదని.. రోడ్డు కుంగిపోతున్న విషయాన్ని మంత్రికి చూపించానని.. అయితే సమస్య ఎత్తిచూపడంతో తనను మంత్రి కొట్టారని ఆరోపించారు. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారని అలా చూస్తూ ఉండిపోయారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+