బంగారం ధరల్లో మరో తగ్గుదల- ఉపశమనం
దేశీయ మార్కెట్‌లో పసిడి ప్రియులకు ఊరట లభించింది. నేడు పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు శాంతించాయి. వీటి పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో ప్రతికూల పరిణామాలు, రూపాయి మారకం విలువలోని వ్యత్యాసాల కారణంగా పసిడి విక్రయాల్లో కరెక్షన్ కు గురయ్యాయి. స్వల్పంగా నష్టపోయాయి.
శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోలిస్తే నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై 540 రూపాయలు తగ్గింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 500, 18 క్యారెట్లు రూ. 410 తగ్గుముఖం పట్టింది. ఇది స్వల్పమే అయినప్పటికీ.. వచ్చే వారం నెగెటివ్ ట్రెండ్ ఉండొచ్చనే మెసేజ్ ను పంపించినట్టయింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తోన్నాయి.

ప్రస్తుత మార్కెట్ గణాంకాల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము ధర రూ.12,786 వద్ద అందుబాటులో ఉంది. 10 గ్రాముల ధర రూ.1,27,860గా నిలిచింది. ఇక సాధారణంగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.11,720కి చేరగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,200 వద్ద రికార్డయింది. లైట్ వెయిట్ ఆభరణాల కోసం ఉపయోగించే 18 క్యారెట్ల పసిడి ధర ఒక గ్రాముకు రూ.41 తగ్గి, రూ.9,589 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,860 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,17,100 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,27,740 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,17,190 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,27,860, రూ.1,17,200 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,27,860, 22 క్యారెట్లు రూ. 1,17,200 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,590
ముంబై..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 12,786, 22 క్యారెట్లు - రూ. 11,720, 18 క్యారెట్లు - రూ. 9,589












Click it and Unblock the Notifications
