RBI: డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్! క్యాష్ విత్‌డ్రా నుంచి అకౌంట్ ఫ్రీజింగ్ వరకు... 30 రోజులే గడువు!

బ్యాంకింగ్ రంగంలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు, సైబర్ మోసాలకు చెక్, రోజువారీ నగదు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంకు వరుస మార్పులు చేసింది. సెప్టెంబర్‌లో భారీగా ఉన్న నిధుల నిల్వలు నవంబర్ వచ్చేసరికి లోటులోకి మారడంతో బ్యాంకులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. మరోవైపు అకౌంట్లపై ఆంక్షల విషయంలో స్పష్టమైన గడువులు విధిస్తూ, ఏటీఎం, స్వైపింగ్ మెషీన్ల వద్ద నగదు విత్‌డ్రా నిబంధనలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. ఈ కీలక మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి.

నిధుల లోటుతో సీఆర్ఆర్ నిబంధన సడలింపు..

సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు 11.16 లక్షల కోట్ల రూపాయల మేర అదనపు నిధులు ఉండగా, నవంబర్ నాటికి పరిస్థితి మారి లోటులోకి వెళ్లింది. నవంబర్ 26న ఈ లోటు 47,641 కోట్ల రూపాయలకు చేరగా, మరుసటి రోజు కాల్ మనీ రేటు కూడా 5.76 శాతానికి ఎగసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పక్షం రోజుల కాలానికి కనీస రోజువారీ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) నిర్వహణ పరిమితిని 99 శాతం నుంచి 90 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

RBI Restores Daily CRR Flexibility To 90 Percent And Consolidates ATM Cash Withdrawal Rules

అనుమానాస్పద ఖాతాలపై డెబిట్ హోల్డ్‌కు గడువు

మనీ మ్యూల్ ఖాతాలు, ఆర్థిక మోసాలకు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే బ్యాంకులు పాటించాల్సిన విధానంపై ఆర్బీఐ తుది మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతా మొత్తం మీద కాకుండా సాధ్యమైనంత వరకు అనుమానాస్పద లావాదేవీ మొత్తంపైనే ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది. ఖాతాపై డెబిట్ హోల్డ్ విధించిన వెంటనే డిజిటల్ మాధ్యమాల ద్వారా, లేదా మరుసటి పనిదినం లోపు భౌతికంగా ఖాతాదారుడికి సమాచారం ఇచ్చి, వివరణ సమర్పించేందుకు ఏడు క్యాలెండర్ రోజుల గడువు ఇవ్వాలి.

Home Loan: వడ్డీ రేట్లు పెంపు, పాతికేళ్ల లోన్‌పై ఏకంగా రూ. 2.45 లక్షల భారం!
Home Loan: వడ్డీ రేట్లు పెంపు, పాతికేళ్ల లోన్‌పై ఏకంగా రూ. 2.45 లక్షల భారం!

విచారణ ప్రక్రియ, 31వ రోజున సడలింపు

ఖాతాదారుడు ఇచ్చిన వివరణను బ్యాంకు ఏడు రోజుల్లో పరిశీలించి సంతృప్తి చెందితే హోల్డ్ ఎత్తివేయాలి, లేదంటే కారణాలతో పాటు పోలీసులకు సమాచారం అందించాలి. పోలీసులకు నివేదించిన 30 రోజుల్లోపు వారి నుంచి తదుపరి ఆదేశాలు రాకపోతే, అంతర్గత తనిఖీ సంతృప్తికరంగా ఉన్న పక్షంలో 31వ రోజున డెబిట్ హోల్డ్‌ను తొలగించాలి. వెయ్యి రూపాయల మినిమం బ్యాలెన్స్ ప్రతిపాదనను తొలగించిన ఆర్బీఐ, ఫిర్యాదుల పరిష్కారానికి నోడల్ అధికారులను నియమించాలని, హోల్డ్‌కు సంబంధించిన రికార్డులను ఐదేళ్ల పాటు భద్రపరచాలని సూచించింది. ఈ నిబంధనలు 2027 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఏటీఎం, స్వైపింగ్ మెషీన్ల రూల్స్ ఛేంజ్

ఏటీఎంలు, పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్ల ద్వారా నగదు విత్‌డ్రా చేసే రూల్స్ మారుస్తూ ఆర్బీఐ కొత్త మాస్టర్ డైరెక్షన్ జారీ చేసింది. గతంలో ఇచ్చిన 17 సర్క్యులర్ల స్థానంలో వచ్చిన ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయి. నెలలో ఉచిత లావాదేవీలు ఎన్ని పూర్తయ్యాయి, ఆ తర్వాత జరిపే లావాదేవీలకు ఎంత రుసుము పడుతుందనే విషయాన్ని బ్యాంకులు తప్పనిసరిగా ఖాతాదారులకు తెలియజేయాలి. అలాగే ఏటీఎం మెట్రో ప్రాంతంలో ఉందా, నాన్-మెట్రో ప్రాంతంలో ఉందా అనే సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించాలి.

Rupee: దడ పట్టిస్తున్న రూపాయి.. డాలర్ షేక్!
Rupee: దడ పట్టిస్తున్న రూపాయి.. డాలర్ షేక్!

ఫ్రీ లిమిట్స్, ఫెయిల్ ట్రాన్సాక్షన్స్..

నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. సొంత బ్యాంకు ఏటీఎంలలో ఐదు, ఇతర బ్యాంకు ఏటీఎంలలో మెట్రో నగరాల్లో మూడు, నాన్-మెట్రో ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీకి పన్నులకు అదనంగా 23 రూపాయలకు మించి రుసుము వసూలు చేయకూడదు. సాంకేతిక లోపాలు, నగదు లేకపోవడం లేదా బ్యాంకు వైపు సమస్యల వల్ల లావాదేవీ విఫలమైతే దాన్ని ఉచిత పరిమితిలో లెక్కించకూడదు, ఎలాంటి రుసుమూ విధించకూడదు.

పీఓఎస్ వద్ద యూపీఐతో నగదు, 17 సర్క్యులర్ల ఉపసంహరణ

డెబిట్ కార్డులు, ఫుల్-కేవైసీ పీపీఐలతో పాటు యూపీఐ ద్వారా కూడా పీఓఎస్ మెషీన్ల వద్ద నగదు తీసుకునే సదుపాయాన్ని కొనసాగించారు. ఒక లావాదేవీకి గరిష్ఠంగా 2,000 రూపాయలు, నెల మొత్తంలో 10,000 రూపాయల వరకు నగదు తీసుకోవచ్చు. వస్తువులు కొనుగోలు చేసినా చేయకపోయినా ఈ సదుపాయం కల్పించాలి, రుసుము విధిస్తే ఒక శాతానికి మించకూడదు. పాత 17 సర్క్యులర్లను ఉపసంహరించుకున్న ఆర్బీఐ, ఫిర్యాదుల పరిష్కారానికి ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం 2026 నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+