Rupee: దడ పట్టిస్తున్న రూపాయి.. డాలర్ షేక్!

అంతర్జాతీయ మారకపు మార్కెట్‌లో భారత రూపాయి మళ్లీ రికవరీ బాట పట్టింది. డాలర్‌తో పోలిస్తే కరెన్సీ విలువ వరుసగా పుంజుకుని ఈ వారం ట్రేడర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఇవాళ విదేశీ కరెన్సీ మార్కెట్ ప్రారంభంలోనే డాలర్‌పై రూపాయి విలువ ఏకంగా 20 పైసలు పెరిగి 94.79 స్థాయికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలతో పాటు అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ కాస్త బలహీనపడటం రూపాయికి బాగా కలిసివచ్చిన అంశంగా మారింది.

ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి నైట్ క్లోజింగ్‌తో పోలిస్తే రూపాయి కొద్దిగా బలపడి 94.75 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 94.79 వద్ద ట్రేడ్ అవుతూ తన ఆధిక్యతను ప్రదర్శించింది. అంతకుముందు గురువారం ట్రేడింగ్‌లోనూ రూపాయి 18 పైసలు పెరిగి 94.99 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ తగ్గడం, ఆర్‌బీఐ ఫారెక్స్ మార్కెట్‌లో చేపట్టిన చర్యలు రూపాయి మరింత దిగజారకుండా నిలబెట్టాయి. అలాగే ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.54 శాతం క్షీణించి 102 వద్దకు చేరడం కూడా మన కరెన్సీకి సానుకూలంగా మారింది.

Indian Rupee Rises 20 Paise To 94 79 Against US Dollar In Early Trade RBI Interventions Support Currency
Rupee: రూపాయి రూలింగ్.. డాలర్ ఢమాల్! వరుసగా ఐదో రోజు జైత్రయాత్ర
Rupee: రూపాయి రూలింగ్.. డాలర్ ఢమాల్! వరుసగా ఐదో రోజు జైత్రయాత్ర

విజృంభిస్తున్న ముడిచమురు.. బ్రేకులు వేస్తున్న స్టాక్ మార్కెట్లు

రూపాయి లాభాల్లోకి వెళ్లినప్పటికీ, దానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు గట్టి సవాలుగా మారాయి. బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.35 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండటంతో రూపాయి సాధించే భారీ లాభాలకు కరెక్ట్ బ్రేకులు పడ్డాయి. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారడం రూపాయి వేగానికి చెక్ పెట్టింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 113 పాయింట్లు నష్టపోయి 74,187 వద్ద, నిఫ్టీ 27.20 పాయింట్లు తగ్గి 22,967.15 వద్ద ట్రేడ్ అయ్యాయి.

రూపాయి రాజసం. ఊహించని విధంగా మారిపోతున్న విలువ
రూపాయి రాజసం. ఊహించని విధంగా మారిపోతున్న విలువ

విదేశీ నిధుల తరలింపు.. మదుపర్ల ఆచి తూచి అడుగులు

మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం కొనసాగుతోంది. గురువారం ఒక్క రోజే ఎఫ్‌ఐఐలు ఏకంగా రూ.5,285.37 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా నుంచి వచ్చిన రిటైల్ సేల్స్, పీపీఐ డేటా అనుకున్నదానికంటే భిన్నంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అయినప్పటికీ, ఆర్‌బీఐ సకాలంలో తీసుకుంటున్న చర్యల వల్ల రూపాయి స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+