Home Loan: వడ్డీ రేట్లు పెంపు, పాతికేళ్ల లోన్‌పై ఏకంగా రూ. 2.45 లక్షల భారం!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతలు, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల కారణంగా ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణ ముప్పును అరికట్టడమే లక్ష్యంగా భారత రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నిర్వహించిన సమావేశంలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.

దీనిఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలపై అయ్యే వ్యయం మరింత పెరగనుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసినప్పటికీ, సొంతింటి కల నెరవేర్చుకున్న మిడిల్ క్లాస్ కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ఇది పెద్ద దెబ్బగానే మారనుంది.

Home Loan Rates to Rise Following RBI Repo Rate Hike Calculate Your Extra Monthly EMI Burden Today

హోమ్ లోన్ ఈఎమ్‌ఐ ఎంత పెరుగుతుందంటే?

ఆర్‌బీఐ పెంచిన ఈ రేట్ల వల్ల ప్రధానంగా 'ఫ్లోటింగ్ వడ్డీ రేటు' ప్రాతిపదికన గృహ రుణాలు తీసుకున్న వారిపై తక్షణ ప్రభావం పడనుంది. ఆర్‌బీఐ రేటు పెంపునకు అనుగుణంగా బ్యాంకులు తమ వద్ద ఉన్న రుణాలపై వడ్డీలను పెంచడం ప్రారంభించనున్నాయి. బ్యాంక్‌బజార్ గణాంకాల ప్రకారం.. 25 ఏళ్ల కాలపరిమితితో 7.50% వడ్డీ రేటు వద్ద రూ. 50 లక్షల హోమ్ లోన్ పొందిన ఒక ఖాతాదారుడి కథనాన్ని పరిశీలిస్తే:

  • పాత ఈఎమ్‌ఐ: రూ. 36,950
  • కొత్త ఈఎమ్‌ఐ (7.75% వద్ద): రూ. 37,766
  • నెలవారీ పెరిగే భారం: దాదాపు రూ. 817
  • మొత్తం చెల్లించాల్సిన అదనపు వడ్డీ: రుణ కాలపరిమితి మొత్తం మీద ఏకంగా రూ. 2,45,063 అదనంగా జేబు నుంచి చెల్లించాల్సి వస్తుంది.

కాలపరిమితి 20 ఏళ్లుగా ఉన్న రుణాలకు నెలకు దాదాపు రూ. 780 చొప్పున మొత్తం మీద రూ. 1.88 లక్షల వరకు అదనపు వడ్డీ భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

RBI Repo Rate Hike: పెరిగిన వడ్డీ రేట్లు, నాలుగేళ్ల తర్వాత ఆర్బీఐ షాక్
RBI Repo Rate Hike: పెరిగిన వడ్డీ రేట్లు, నాలుగేళ్ల తర్వాత ఆర్బీఐ షాక్

టాప్ బ్యాంకుల్లో ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్ల స్థితిగతులు!

ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఆర్‌బీఐ నిర్ణయానికి ముందు ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను పరిశీలిస్తే:

ప్రభుత్వ రంగా బ్యాంకులు:

బ్యాంక్ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.00%
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.00%
బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.10%
కెనరా బ్యాంక్ 7.15%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.25%

ప్రైవేట్ బ్యాంకులు:

బ్యాంక్ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు
ఫెడరల్ బ్యాంక్ 7.35%
ఐసీఐసీఐ బ్యాంక్ 7.55%
కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.60%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7.75%
యాక్సిస్ బ్యాంక్ 8.00%

ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఈ బ్యాంకులన్నీ రాబోయే రోజుల్లో క్రమంగా తమ వడ్డీ రేట్లను మరో 0.25 శాతం వరకు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రుణగ్రహీతలు ఏం చేయాలి? నిపుణులు ఇస్తున్న సూచనలు!

ఈ వడ్డీ రేట్ల బాదుడు నుంచి తప్పించుకోవడానికి లేదా నెలవారీ భారాన్ని తగ్గించుకోవడానికి బ్యాంకులు కొన్నిసార్లు ఈఎమ్‌ఐ పెంచకుండా రుణ కాలపరిమితిని (టెన్యూర్) పొడిగించే ఆప్షన్‌ ఇస్తుంటాయి. అయితే కాలపరిమితి పెరిగితే చివరికి కట్టే మొత్తం వడ్డీ ఇంకా ఎక్కువగా మారుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరోవైపు 'ఫిక్స్డ్ రేట్' విధానంలో రుణాలు తీసుకున్న వారికి ప్రస్తుతానికి ఎటువంటి భారం పడదు.

Gold Loans: ఆర్బీఐ అండతో పరుగు! సౌత్ ఇండియా.. గోల్డ్ లోన్ల అడ్డా
Gold Loans: ఆర్బీఐ అండతో పరుగు! సౌత్ ఇండియా.. గోల్డ్ లోన్ల అడ్డా

అదనపు వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి రుణగ్రహీతలు తమ వద్ద ఉన్న పొదుపు మొత్తంతో 'పాక్షిక ముందస్తు చెల్లింపు' (Partial Prepayment) చేయడం, లేదా తక్కువ వడ్డీని ఆఫర్ చేసే వేరే బ్యాంకులకు రుణాన్ని బదిలీ (Balance Transfer) చేసుకోవడం లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం వంటి వ్యూహాలను అనుసరించడం శ్రేయస్కరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+