ఈవ్ టీజర్లపై షీ టీమ్స్ ఉక్కుపాదం.. ఏకంగా 1,530 మంది అరెస్ట్..!

హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 2 లక్షలకు పైగా గణేష్ విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. హైదరాబాద్ మహా నగరం వ్యాప్తంగా 45 వేల మంది పోలీసులు, 141 కేంద్రాలు, 275 క్రేన్లతో పోలీసు, జీహెచ్​ఎంసీ సహా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. అయితే గణేష్ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్న నేపథ్యంలో మహిళలు, అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ లకు పాల్పడిన ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ షీ టీమ్స్ చేపట్టిన ప్రత్యేక నిఘా ఆపరేషన్‌ లో భాగంగా రికార్డు స్థాయిలో 1,530 మంది ఈవ్‌ టీజర్లను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో గణేష్ నవరాత్రులు సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు జరిగాయి. ఈ రోజుల్లో షీ టీమ్స్ ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో ఆకతాయిలపై షీ టీమ్స్ ప్రత్యేకమైన నిఘా పెట్టింది.

ఖైరతాబాద్, బాలాపూర్ తో పాటు రద్గీగా ఉంటే నిమజ్జన మార్గాల్లో మఫ్టీలో పోలీసులు నిఘా ఉంచారు. ఈ మేరకు మహిళలు, యువతులను వేధించిన వారిపై కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు మొత్తం 54 షీ టీమ్స్ బృందాలను మఫ్టీలో ఉంచి పూర్తిగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే దాదాపు 1,530 మందికి పైగా ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఇక మహిళలు, యువతుల పట్ల కఠినంగా వ్యవహరించిన మరో 48 మందికి కోర్టు ద్వారా శిక్ష పడేటట్లు చేశారు. ఇక దాదాపు 750 మందికి షీ టీమ్స్ తమ కుటుంబ సభ్యుల ఎదుట కౌన్సిలింగ్ నిర్వహించింది. ఈ మేరకు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని షీ టీమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

SheTeams crack down during Hyderabad Ganesh Navaratri a staggering 1 530 eveteasers arrested now

ఇక హైదరాబాద్ లో నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు. పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ సహా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అలాగే ఖైరతాబాద్‌ వినాయక నిమజ్జనానికి దాదాపు 30 లక్షల మంది భక్తులు హాజరయ్యారని పోలీసులు తెలిపారు. అలగే బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జనానికి దాదాపు 15 లక్షల మంది హాజరయ్యారని వివరించారు. నిమజ్జనానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+