Adulterated Ghee: హైదరాబాద్‌ లో H- FAST​ భారీ ఆపరేషన్.. 36 టన్నుల కల్తీ నెయ్యి సీజ్..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కల్తీ మాఫియా పంజా విసురుతోంది. ప్రతి వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అయితే తాజాగా కల్తీ కేటుగాళ్లపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలపై H- FAST​ రంగంలోకి దిగింది. నగరంలోని కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై ఆహార భద్రతా శాఖతో సమన్వయం చేసుకుని H- FAST​ అధికారులు దాడులు నిర్వహించారు.

సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, రసాయన మిశ్రమాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం డీసీపీ వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి మొత్తం 130 కేంద్రాల్లో దాడులు నిర్వహించామని అన్నారు. స్కీమ్డ్ మిల్క్, క్రీమ్, పామాయిల్, గంజి స్టార్చ్ ను ఉపయోగించి కల్తీ నెయ్యి తయారీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వనస్పతి నూనె, రవ్వ కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని వివరించారు. ఇక సంఘటనా స్థలంలో ఫుడ్ సేఫ్టీ ఇన్‌ స్పెక్టర్లు శాంపిళ్లను సేకరించారు. ఆ తర్వాత ల్యాబ్‌ కు పంపారు. స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించారు.

Adulteration Hyderabad Adulteration mafia in Hyderabad Police seize 36 tonnes of adulterated ghee

స్వాధీనం చేసుకున్న వివరాలు చూస్తే.. కల్తీ నెయ్యి సుమారు 25.5 టన్నులు, క్రీమ్ ముడి సరుకు సుమారు 8.7 టన్నులుగా ఉంది. అలాగే పామాయిల్ 1,200 లీటర్లు, వనస్పతి డాల్డా 600 లీటర్లుగా ఉంది. ఇక కృత్రిమ నెయ్యి సువాసన ద్రవ్యాలు 3 రకాలకు చెందినవి 6 బాటిల్స్ కాగా.. స్టార్చ్ 30 కేజీలు ఉంది. ఇలా మొత్తం 36 టన్నుల కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. ఇక కల్తీ నెయ్యిని ప్రముఖ బ్రాండ్లతో లేబుల్‌ చేసి అమ్ముతున్నారని తెలిపారు. ఫుడ్​ సేఫ్టీ లైసెన్స్ లేకుండా లూజు నెయ్యి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని గైక్వాడ్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ ఫుడ్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+