ఆ దేశానికి అండగా బయల్దేరిన పాకిస్థాన్ సైన్యం.. మిసైల్ దాడుల వేళ..

సౌదీ అరేబియా- హౌతీ దళాల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి. సౌదీ అరేబియాలోని కీలకమైన స్థావరాలపై హౌతీలు దాడులను వేగవంతం చేశాయి. శనివారం- ఆదివారం మధ్య తమ దేశం వైపునకు దూసుకొచ్చిన అనేక క్షిపణులను నేల కూల్చినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.

అలాగే సౌదీలోని ఎనర్జీ, మిలిటరీ, ట్రాన్స్ పోర్ట్ తదితర ఐదు కీలక స్థావరాలపై దాడులు చేపట్టినట్లు హౌతీ దళాలు స్పష్టం చేశాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు అండగా పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు పాకిస్థాన్ సైన్యాన్ని పంపించింది. సౌదీ అరేబియా- పాకిస్థాన్- టర్కీ దేశాల మధ్య కుదిరిన మక్కా జాయింట్ డిఫెన్స్ పాక్ట్ లో భాగంగా పాకిస్థాన్ తన సైన్యాన్ని సౌదీకి పంపించింది.

ఈ మేరకు సౌదీకు వెళ్లే సైనికులతో పాకిస్థాన్ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి మహమ్మద్ అసిఫ్ ఖవాజా, పాకిస్థాన్ లోని సౌదీ అరేబియా రాయబారి రాజే తామి అల్బుగామీ పాల్గొన్నారు. ఇక మక్కా ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా భద్రత, ఆ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు పాకిస్థాన్ కట్టుబడి ఉందని ఆ దేశ ఆర్మీ తెలిపింది. ఇక అల్ జజీరా కథనం ప్రకారం.. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన లాహోర్ కార్ప్స్ నుంచి వివిధ హోదాల్లో భాగంగా దాదాపు 100 మంది సైనికులు సౌదీ అరేబియాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కానీ ఎంతమంది సైనికులను పంపిస్తారన్న దానిపై ఇస్లామాబాద్ నుంచి ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తోంది.

Pakistani army heads to Saudi Arabia amid fears of Houthi attacks Pakistani army Saudi Arabia

మరోవైపు సౌదీ అరేబియాలోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా హౌతీ దళాలు దాడులకు పాల్పడుతున్నాయి. వాటిల్లో రియాద్ లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు అబ్హా, ఖమీస్ ముషెత్ ప్రాంతాల్లోని రాడార్ కేంద్రాలపై దాడులు జరిగాయి. అలాగే సౌదీ అరేబియాలోని ఆరామ్ కోకు చెందిన ఇంధన కేంద్రాలపైనా దాడులు చేపట్టాయి హౌతీ దళాలు. ఇక హౌతీ దళాలు దాడులు చేపట్టిన వాటిల్లో జజాన్ చమురు శుద్ధి కార్మాగారం కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+