ఇండియా కూటమికి తేల్చేసిన స్టాలిన్- యూటర్న్ పై డీఎంకే ట్వీట్..!

త్వరలో పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టబోతున్న డీలిమిటేషన్ బిల్లులకు (Delimitation Bill) మద్దతివ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. ఇవాళ ఇండియా కూటమితో జరిగిన చర్చల్లోనూ దానే పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ నిర్ణయం నేపథ్యంలో ఆయన్ను బుజ్జగించేందుకు ఇండియా కూటమి పార్టీల నుంచి ప్రధాన నేతలంతా చెన్నైకు తరలివచ్చారు. అయినా డీఎంకే-కాంగ్రెస్ చర్చల్లో (DMK-Congress Talks )స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

Explainer: డీలిమిటేషన్ కమిషన్ లో సభ్యులెవరు ? డెడ్ లైన్ ఎంత? కేంద్రం లెక్క ఇదే.!
Explainer: డీలిమిటేషన్ కమిషన్ లో సభ్యులెవరు ? డెడ్ లైన్ ఎంత? కేంద్రం లెక్క ఇదే.!

తనతో భేటీ కోసం ఢిల్లీ నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహులా గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతాా బెనర్జీ, ఇతర నేతల్ని స్టాలిన్ సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించారు. వారితో దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. ఇందులో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియ వల్ల కలిగే పరిణామాలను సోనియా గాంధీ వివరించగా, వచ్చే ఏడాది దీనిని అమలు చేస్తే తమిళనాడుపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు. ఒకవేళ తాము (డీఎంకే) ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకుంటే, కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణ ఏమిటని స్టాలిన్ ప్రశ్నించగా, కాంగ్రెస్ వైపు నుండి ఎటువంటి స్పష్టమైన సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా అర్ధాంతరంగా ముగిశాయి.

DMK-Congress Talks Fail Over Delimitation Bill MK Stalin Sticks to Fair Delimitation Demand

డీలిమిటేషన్ బిల్లులకు ఫుల్ మెజార్టీ- బీజేపీ అంచనా ఇదే- ఎక్స్ ట్రా 11 ఓట్లు..!
డీలిమిటేషన్ బిల్లులకు ఫుల్ మెజార్టీ- బీజేపీ అంచనా ఇదే- ఎక్స్ ట్రా 11 ఓట్లు..!

ఇండియా కూటమితో స్టాలిన్ భేటీ ముగిశాక డీఎంకే ఐటీ విభాగం ఎక్స్ లో కీలక ట్వీట్ పెట్టింది. ఇందులో గతంలో డీఎంకే డీలిమిటేషన్ ను ఎందుకు వ్యతిరేకించిందనేది వివరించింది. ఇందులో ఒకటి ఎంపీ స్థానాలను కోల్పోయే ప్రమాదం: తమిళనాడుకు చెందిన లోక్‌సభ స్థానాల సంఖ్య 39 నుండి 31 లేదా 32కు తగ్గే అవకాశం ఉండేదని తెలిపింది. అలాగే రెండో అంశం పార్లమెంటులో తగ్గే ప్రాతినిధ్యం: పార్లమెంటులో తమిళనాడు వాటా 5.71%-5.89%కి పడిపోయే ప్రమాదం ఉండేదని వివరించింది. అలాగే మూడో అంశం 2027 వరకు మాత్రమే రక్షణ: 2027 జనాభా లెక్కల తర్వాత తమిళనాడుకు చెందిన పార్లమెంటరీ స్థానాలు తగ్గే అవకాశం ఉండేదని పేర్కొంది. కానీ ఇప్పుడు డీఎంకే దీనికి ఎందుకు మద్దతు ఇస్తోందని కూడా వెల్లడించింది. ఎంపీ స్థానాల పెంపు: తమిళనాడుకు చెందిన లోక్‌సభ స్థానాలు తగ్గకపోగా, అవి 59కి పెరిగే అవకాశం ఉందని, పెరిగిన పార్లమెంటరీ ప్రాతినిధ్యం: పార్లమెంటులో తమిళనాడు వాటా 7.23% వరకు ఉండేలా రక్షణ లభిస్తుందని, 2051 వరకు రక్షణ: రాబోయే 25 ఏళ్ల పాటు తమిళనాడుకు చెందిన పార్లమెంటరీ స్థానాలు తగ్గవని తేల్చిచెప్పేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+