అక్రమ అండాల సేకరణ కేసు: ఓయాసిస్ ఫెర్టిలిటీ రూ.2,487కోట్ల ట్రాన్సాక్షన్లు,కళ్ళు తిరిగే ఆదాయం!

ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల పేరుతో దేశవ్యాప్తంగా అక్రమ అండాల సేకరణ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మల్కాజిగిరి పోలీసుల దర్యాప్తులో సంచలన వివరాలు బయటపడుతున్నాయి. సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ కేంద్రాల ద్వారా నెలకు రూ.27 నుంచి రూ.28 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో సంస్థకు చెందిన ఇద్దరు కీలక ఉన్నతాధికారులను అరెస్టు చేయడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది.

పోలీసుల ప్రకారం వివిధ రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా మహిళలను సమీకరించి అండాల దానం కోసం నియమించుకున్నారు. అనుమతులు లేకుండా అండాల సేకరణ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ప్రక్రియలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్‌లోని సద్గురు ఏఆర్టీ బ్యాంక్ ఇన్‌ఛార్జ్ సునీల్ రాయ్ నియామక ప్రక్రియను సమన్వయం చేసినట్లు, సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ గెడెల దుర్గారావు ఆదేశాల మేరకు ఈ కార్యకలాపాలు సాగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Oasis Fertility Illegal Egg Collection Case Centre Allegedly Earned Rs 28 Crore Monthly Rs 2 487 Crore Transactions

అండాల ఉత్పత్తిని పెంచేందుకు మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి, తర్వాత ఇతర ఫెర్టిలిటీ కేంద్రాలకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.సద్గురు హెల్త్‌కేర్ దేశవ్యాప్తంగా 43 ఫెర్టిలిటీ క్లినిక్‌లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రతి నెలా సుమారు 600 సెల్ఫ్ సైకిల్స్‌తో పాటు 100 అండాల దాతల సైకిల్స్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కార్యకలాపాల ద్వారా నెలకు రూ.27-28 కోట్ల ఆదాయం సమకూరినట్లు అంచనా.

సంస్థ పేరుతోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 26 వరకు రూ.2,487.82 కోట్ల మేర డెబిట్, క్రెడిట్ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లావాదేవీల స్వభావాన్ని పరిశీలిస్తున్నారు.తాజాగా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రతీక్ అనిల్ గగ్లానీ, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్ లను అరెస్టు చేశారు. గగ్లానీ 2025 నుంచి సీఓఓగా పనిచేస్తూ కార్యకలాపాలు, పరికరాల కొనుగోలు, నిధుల సమీకరణను సమన్వయం చేసినట్లు, డాక్టర్ దేబ్ ఏప్రిల్‌లో చేరి క్లినికల్ కార్యకలాపాలు, థియేటర్ల నిర్వహణను పర్యవేక్షించినట్లు ఆరోపణలు.

గగ్లానీ నెలకు రూ.4.20 లక్షలు, డాక్టర్ దేబ్ రూ.3.60 లక్షల జీతం పొందినట్లు తెలిసింది. వీరికి అక్రమ కార్యకలాపాలపై అవగాహన ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.భారతదేశంలో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం అండాల దానం, సరోగసీపై కఠిన నిబంధనలు విధించింది. వాణిజ్యీకరణను నిషేధించి, నైతిక ప్రమాణాలు, అనుమతులు తప్పనిసరి చేసింది.

తల్లి చనిపోయినా అంత్యక్రియలకు రాని కొడుకు.. తరిమికొట్టిన గ్రామస్థులు, జనగామలో ఘటన!
తల్లి చనిపోయినా అంత్యక్రియలకు రాని కొడుకు.. తరిమికొట్టిన గ్రామస్థులు, జనగామలో ఘటన!

ఇలాంటి అక్రమ నెట్‌వర్క్‌లు మహిళల ఆరోగ్యానికి ముప్పు కలిగించడంతో పాటు చట్టవ్యతిరేకమని నిపుణులు అంటున్నారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. అండాల సేకరణ ఎలా జరిగింది, ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+