అన్నా...నువ్వు మావోనివే..! సినిమా రిలీజ్ అయితే చాలు బ్లాక్ బస్టర్..!
మలయాళం యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ అక్కడ ఏం సినిమాలు తీస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ తెలుగు హీరోలకు మించిన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్నారు. మహానటి మూవీలో కీలక పాత్రతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత సీతారామం, కల్కి 2898ఏడీ, లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుసగా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఆకాశంలో ఒక తార చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దుల్కర్ సల్మాన్.
తాజాగా దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి కలిసి నటించిన 'ఆకాశంలో ఒక తార' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన ఈ మూవీ తొమ్మిది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. అలాగే రూ..26 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది ఈ మూవీ.
ఆకాశంలో ఒక తార చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.28 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో రూ.29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్స్ తో పోల్చితే మరో రూ. 3 కోట్లకు పైగా వసూల్లు రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం నాటికి సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులను అధిగమించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సక్సెస్ మీట్ ను కూడా చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. దుల్కర్ సల్మాన్ ను 'అన్నా నువ్ మావోనివే..' అంటూ ప్రశంసించారు.

ఇక ఆకాశంలో ఒక తార మూవీకి పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, రుహానీ శర్మ, స్వాసిక, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు.












Click it and Unblock the Notifications
