హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు 25లక్షల సుపారీ.. ఆరుగురి అరెస్ట్!

హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఫిర్యాదు అందిన కొద్ది గంటల్లోనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు సుపారీ మాట్లాడుకుని ఈ కుట్రకు తెరలేపినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండలోని స్వరాజ్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్, అతడి సోదరుడు ఫయాజ్ ఖాన్ నెల రోజుల క్రితం బోరబండ ప్రాంతానికి చెందిన మిస్బాను కలిశారు. బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేస్తే రూ.20 నుంచి రూ.25 లక్షలు ముట్టజెబుతామని ప్రతిపాదించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత మరికొందరిని కలుపుకుని దాడికి సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడుకున్నట్లు సమాచారం.

Murder plot hyderabad with 25 lakhs Former Deputy Mayor Baba Fasiuddin Foiled Six Arrested in Hyderabad

బాబా ఫసియుద్దీన్ నివాసం పరిసరాల్లో కొందరు అనుమానాస్పదంగా తిరుగుతూ, కత్తులతో రెక్కీ నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులకు చేరింది. ఆయన కదలికలు, రాకపోకలను గమనిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలకు ఆదేశించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు సాక్ష్యాలు, స్థానిక సమాచారం, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించి పట్టుకున్నాయి.

అరెస్టయిన వారి నుంచి పోలీసులు రెండు కత్తులతో పాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఇమ్రాన్ ఖాన్, దేవర రాజా, ఫయాజ్ ఖాన్, మహమ్మద్ కాశిఫ్, మిస్బా, షేక్ నవాజ్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న సయ్యద్ హాది కోసం గాలింపు కొనసాగుతోంది. పట్టుబడిన ఆరుగురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన నిరసన, దాడిపై భగ్గుమన్న కవిత!
పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన నిరసన, దాడిపై భగ్గుమన్న కవిత!

స్వాధీనం చేసుకున్న ఫోన్‌లలోని కాల్ లాగ్స్, చాట్‌లు, డిజిటల్ డేటాను సైబర్, సాంకేతిక బృందాలు పరిశీలిస్తున్నాయి. సుపారీ వెనుక అసలు సూత్రధారులు ఎవరైనా ఉన్నారా, ఆర్థిక లావాదేవీలు ఏ మార్గాల్లో జరిగాయి, ఆయుధాలు ఎలా సమకూర్చుకున్నారు వంటి కోణాల్లో విచారణ సాగుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+