బెంగళూరులో ఇకపై ఈ నూతన నియోజకవర్గాలు

డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కర్ణాటక రాజకీయ సమతుల్యతను గణనీయంగా మారిపోనుంది. బెంగళూరు అర్బన్ ప్రాంతానికి లోక్ సభ, శాసనసభ స్థానాల్లో ప్రాతినిధ్యం భారీగా పెరిగే అవకాశం ఉంది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ ప్రాతిపదికగా రాష్ట్ర రాజకీయాల్లో సైతం బెంగళూరు ప్రాబల్యం ఇప్పుడున్న స్థాయి కంటే కూడా చాలా బలపడనుంది. బెంగళూరు పరిధిలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య భారీగా పెరగబోతోండటమే దీనికి ప్రధాన కారణం.

కర్ణాటకలో ప్రస్తుతం మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 28. డీలిమిటేషన్ అనంతరం ఈ సంఖ్య 42 కు పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే శాసనసభ స్థానాల సంఖ్య కూడా ప్రస్తుతం ఉన్న 224 నుంచి 336కు పెరుగుతుందని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యలో దాదాపు 50 శాతం పెరుగుదల నమోదవుతుంది. ఈ విస్తరణలో భాగంగా బెంగళూరు అర్బన్ పరిధిలోని లోక్‌సభ స్థానాలు ప్రస్తుత నాలుగు నుంచి ఆరుకు పెరుగనున్నాయి. అంటే కొత్తగా రెండు లోక్ సభ స్థానాలు రానున్నాయి.

Bengaluru and Karnataka Assembly representation under a proposed 50 percent expansion of seats

50 శాతం ప్రాతిపదికన తీసుకుంటే.. బెంగళూరు అర్బన్ లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుత 28 నుంచి 42కు చేరుతుంది. అంటే నగరం పరిధిలోనే కొత్తగా 14 శాసనసభ స్థానాలు అందుబాటులోకి వస్తాయి. స్థానికంగా అసెంబ్లీలో రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగినా కూడా బెంగళూరులో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య మెరుగుపడుతుంది.

మనసు మార్చుకున్న మమత బెనర్జీ
మనసు మార్చుకున్న మమత బెనర్జీ

బెంగళూరు మొత్తం జనాభా 1.29 కోట్లు. ఇందులో సుమారు 96 లక్షలకు పైగా జనం బెంగళూరు అర్బన్ జిల్లా పరిధిలో నివసిస్తోన్నారు. ఫలితంగా ఇక్కడ ఎంపీ స్థానాల సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రస్తుత బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గాలతో పాటు మహాదేవపుర, బొమ్మనహళ్ళి, శివాజీనగర లల్లో ఒకటి కొత్త లోక్ సభ స్థానంగా మారొచ్చు. బెంగళూరు రూరల్ పరిధి నుంచి రామనగర గానీ, కనకపుర గానీ లోక్ సభ స్థానంగా ఉద్భవించే అవకాశం ఉంది.

ఖర్గే ఫైనల్ ట్రయల్స్: స్టాలిన్, శరద్ పవార్ ఇంటికి
ఖర్గే ఫైనల్ ట్రయల్స్: స్టాలిన్, శరద్ పవార్ ఇంటికి

కర్ణాటక మొత్తం జనాభాలో బెంగళూరు అర్బన్ వాటా 15.75 శాతంగా ఉంటోంది. దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా 336 స్థానాలకు పెరిగితే బెంగళూరు ఒక్కదానికే ఏకంగా 53 స్థానాలు దక్కుతాయి. దీనివల్ల అసెంబ్లీలో బెంగళూరు ప్రాతినిధ్యం ఏకంగా 89.3 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

శాసనసభ స్థానాల సంఖ్య పెరిగితే నగరంలో రిజర్వుడ్ స్థానాల వర్గీకరణ కూడా మారుతుంది. చట్టసభల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్ల చట్టం వర్తింపజేస్తే, 42 సీట్ల నమూనాలో బెంగళూరు నుంచి 14 మంది మహిళా ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. ఒకవేళ స్థానాల సంఖ్య 53కు పెరిగితే మహిళలకు దక్కే సీట్లు 18కి చేరుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+