ఏఐ ల్యాబ్‌లలో ఆ 'బాంబు' రహస్యం ఏంటి? వణికిపోతున్న సైబర్ ప్రపంచం!

క్రిప్టోగ్రఫీ రంగంలో ఏఐ సంస్థలు సంచలన పురోగతి సాధించి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నాయన్న ఊహాగానాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆధునిక డిజిటల్ ప్రపంచానికి రక్షణ కవచంగా నిలుస్తున్న ఎన్‌క్రిప్షన్ వ్యవస్థలను ఛేదించే గణితశాస్త్ర ఆవిష్కరణలు ప్రముఖ ఏఐ ల్యాబ్‌ల వద్ద ఉండవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బ్యాంకింగ్ లావాదేవీలు, వ్యక్తిగత సమాచారం, ప్రభుత్వ రహస్యాలు, నిఘా డేటా వంటివన్నీ ప్రమాదంలో పడే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వార్తలతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ప్రభుత్వాలు, సైబర్ భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

IIT Placements: ఏఐ దెబ్బకు ఐఐటీల్లో మారిన ట్రెండ్- వీరికే ప్లేస్ మెంట్స్- జాబ్ కావాలంటే?
IIT Placements: ఏఐ దెబ్బకు ఐఐటీల్లో మారిన ట్రెండ్- వీరికే ప్లేస్ మెంట్స్- జాబ్ కావాలంటే?

దశాబ్ధాలుగా పరిశోధకులకు కొరకురాని కొయ్యగా ఉన్న క్రిప్టోగ్రఫీ సంబంధిత క్లిష్టమైన గణిత సమస్యలపై ఏఐ మోడళ్లు ముందడుగు వేశాయన్న నివేదికలను ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త స్కాట్ ఆరోన్సన్ ప్రస్తావించారు. క్రిప్టోగ్రఫీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంచలన ఆవిష్కరణలు ఏఐ ల్యాబ్‌ల వద్ద ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తనకు దాదాపు ఖచ్చితంగా తెలిసిందని ఆయన ఇటీవల ఓ పోస్టులో పేర్కొన్నారు. ఈ రంగంలో పురోగతిపై బలమైన కథనాలు వినిపిస్తున్నాయని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

AI Cryptography Rumours Spark Encryption Threat Concerns Ahead of 2032 Target Read expert views on risks timelines

ఎన్‌క్రిప్షన్‌కు ముప్పు అంటే ఏమిటి?
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు, సాధారణ వ్యక్తుల మధ్య జరిగే సమాచార మార్పిడికి ఎన్‌క్రిప్షన్‌ ప్రాణాధారం. డేటాను సంకేత భాషలోకి మార్చి అనధికార వ్యక్తుల కంట పడకుండా ఇది కాపాడుతుంది. ఎన్‌క్రిప్షన్‌కు ఆధారమైన గణిత సూత్రాలను ఛేదించే వేగవంతమైన మార్గం ఏదైనా లభిస్తే.. ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, దౌత్యపరమైన సందేశాలు, వ్యక్తిగత ఈమెయిళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది.

అయితే ఏఐ సంస్థలు అసలు ఏమి కనుగొన్నాయన్న దానిపై స్పష్టత లేదు. ప్రస్తుత ఎన్‌క్రిప్షన్‌ వ్యవస్థలను వేగంగా ఛేదించే కొత్త గణిత మార్గాన్ని ఏఐ మోడళ్లు కనుగొని ఉండవచ్చని ఓ వాదన వినిపిస్తోంది. మరోవైపు అలాంటి షార్ట్‌కట్ మార్గాలు అసలు లేవని ఏఐ మోడళ్లు నిరూపించి ఉండవచ్చన్న కోణం కూడా ఉంది. ఏదేమైనా గణితశాస్త్రంలో ఏఐ ఇటీవల చూపిస్తున్న ప్రతిభ సాంకేతిక ప్రపంచం అంచనాలను తలకిందులు చేస్తోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ స్టీవెన్ ముర్డోక్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ ఆసక్తికరమైన, లోతైన గణితం చేయలేదని గతంలో భావించిన వారు ఖచ్చితంగా తప్పుపడ్డారని.. ఏఐ సామర్థ్య పరిమితి ఎక్కడ ఉందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు.

వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్? వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్!
వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్? వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్!

2032 లక్ష్యానికి ముందే ముప్పు ముంచుకొస్తుందా?
ఇప్పటివరకు ఎన్‌క్రిప్షన్‌ వ్యవస్థలకు ప్రధాన ముప్పు క్వాంటమ్ కంప్యూటర్ల నుంచే ఎదురవుతుందని నిపుణులు భావిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత భద్రతను ఛేదించగల స్థాయి క్వాంటమ్ సాంకేతికత అందుబాటులోకి రావడానికి ఇంకా ఏళ్ల సమయం పడుతుంది. అందుకు తగిన ప్రత్యామ్నాయ భద్రతా వ్యవస్థలను సిద్ధం చేసుకునేందుకు ప్రభుత్వాలు, సంస్థలు 2032 నాటిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఏఐ ఆవిష్కరణలతో ఆ గడువు కూడా తప్పిపోయే ప్రమాదం ఉందని ముర్డోక్ హెచ్చరించారు.

ఏఐ పురోగతి కారణంగా క్రిప్టోగ్రఫీ ముప్పు ఊహించిన దానికంటే ముందే రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ తమ మోడళ్లు ఎన్‌క్రిప్షన్‌ను ఛేదించగలవని ఏ ఏఐ సంస్థ కూడా ఇప్పటివరకు బహిరంగంగా ధ్రువీకరించలేదు. ఏదైనా కొత్త గణిత ఆవిష్కరణ లేదా రుజువు వచ్చినా.. దానిని మానవ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సర్రే ప్రొఫెసర్ అలన్ వుడ్‌వర్డ్ వెల్లడించారు. అందువల్ల ఎన్‌క్రిప్షన్ వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకూలే అవకాశం తక్కువని ఆయన విశ్లేషించారు.

వేగంగా మారే సంస్థలకే రక్షణ
సంచలన ఆవిష్కరణకు సంబంధించి ఏదైనా ప్రకటన వెలువడితే.. పరిస్థితిని సరిదిద్దుకుని కొత్త భద్రతా ఏర్పాట్లుకు మారేందుకు సంస్థలకు తక్కువ సమయమే లభించవచ్చు. సాంకేతిక మార్పులకు త్వరగా స్పందించి వేగంగా మారగల చురుకైన సంస్థలే ఈ ముప్పు నుంచి సురక్షితంగా బయటపడతాయని.. పాత పద్ధతుల్లోనే ఉండిపోయే సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని అలన్ వుడ్‌వర్డ్ స్పష్టం చేశారు. డిజిటల్ భద్రత విషయంలో ప్రపంచ దేశాలు, సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+