సంక్రాంతికి చిరంజీవి 'కాకా' మూవీ.. 'ఆటో జానీ' గా మెగాస్టార్ విధ్వంసం..

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే సాధారణంగా థియేటర్లలో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్.

ఇప్పుడు మరోసారి సంక్రాంతి రేసులో ఉండేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'కాకా' మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ మేరకు స్వయంగా చిరంజీవి రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'కాకా' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దాంతో మెగాస్టార్ మూవీ వాయిదా అంటూ వచ్చిన రూమర్స్ కు చెక్ పడింది.

Chiranjeevi Kaaka to arrive for Sankranti grand release on January 13th Chiranjeevi latest movie

కాకా మూవీలో మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ చేయని పాత్రలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. 'ఆటో జానీ' గా ఆయన ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. బ్లాక్‌ బస్టర్ దర్శకుడు బాబీ (కే ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. గతంలో చిరంజీవి- బాబీ కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో మలయాళం బ్యూటీ అనస్వర రాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి.. వరుసగా 2027 సంక్రాంతి బరిలోనూ దిగుతుండటం విశేషం. ఇక కాకా మూవీతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మెగా విధ్వంసం ఖాయమని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరోవైపు చిరంజీవి శ్రీకాంత్ ఓదెల తోనూ ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+