ఏపీ పంచాయతీ రెండో దశ ఫలితాలు: మళ్లీ కూటమి జోరు- అక్కడ మాత్రం వైసీపీ..!
ఏపీలో ఇవాళ జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. పలు చోట్ల ఇప్పటికే కౌంటింగ్ కూడా పూర్తయి ఫలితాలు (AP Gram Panchayat Elections Phase 2 Results) ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నారు. ఇందులో తొలి దశ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రెండో దశలోనూ కూటమి పార్టీలు దూసుకుపోతున్నాయి. అయితే పలు చోట్ల వైసీపీ కూడా సత్తా చాటుకుంటోంది. రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెల్చుకుందో ఇప్పుడు తాజా అప్డేట్ చూద్దాం..
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఇవాళ జరిగిన పంచాయతీ ఎన్నికల రెండో దశలో భాగంగా 4975 గ్రామాల్లో పోలింగ్ జరిగింది. ఇందులో తాజా సమాచారం అందే సరికి 1108 సీట్లలో కూటమి, 68 సీట్లలో వైసీపీ, 18 సీట్లలో ఇతరులు విజయాలు సాధించారు. మిగతా చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. సాయంత్రానికి ఫలితాల సరళిపై మరింత క్లారిటీ రానుంది. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి పూర్తి స్దాయిలో ఫలితాలు వెలువడతాయని అంచనా వేస్తున్నారు..














Click it and Unblock the Notifications
