మన్ కీ బాత్: నషాముక్త్ భారత్, సంచార్ సాథీ, మిషన్ కర్మయోగిపై ప్రధాని మోదీ!

దేశంలోని యువత కలలకు డ్రగ్స్ వ్యసనం పెద్ద సవాలుగా మారిందని, ఈ పరిస్థితుల్లో నషా ముక్త్ యువ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు 140వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. డ్రగ్స్ వ్యసనాన్ని జయించి జీవితానికి కొత్త దిశను తెచ్చుకున్న ఢిల్లీకి చెందిన ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడారు.

డ్రగ్స్ వల్ల హాని తప్ప ప్రయోజనం లేదని, యువత వాటికి దూరంగా ఉండాలని ప్రధానమంత్రి సమక్షంలో ఆ యువకుడు సందేశమిచ్చాడు. యువతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం కుటుంబానికి, దేశానికి చాలా ముఖ్యమని ప్రధాని పిలుపునిచ్చారు. ఫిట్‌నెస్‌తో పాటు క్రీడారంగంలోనూ భారతదేశం కొత్త విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫిట్ ఇండియా 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమం 100 వారాలు పూర్తి చేసుకుందని తెలిపారు. 2024 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 30 వేలకు పైగా ప్రాంతాల్లో దాదాపు 37 లక్షల మంది పాల్గొన్నారని వెల్లడించారు.

Mann Ki Baat 140th Episode PM Modi Shares Key Messages on Drug Abuse Fight Sanchar Saathi and Fit India

2032 యూసీఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు పుణే ఆతిథ్యమివ్వనుందని చెప్పారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలోని ఆరు నగరాల్లో ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయని పేర్కొన్నారు. మారుతున్న వాతావరణంలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంతో పాటు సైబర్ మోసాలను అరికట్టడంలో 'సంచార్ సాథీ' డిజిటల్ వేదిక కీలకంగా ఉపయోగపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

దీని ద్వారా దేశ వ్యాప్తంగా 14 లక్షలకు పైగా పోయిన ఫోన్లు తిరిగి యజమానులకు చేరాయని వెల్లడించారు. అనుమానాస్పద కాల్స్, మోసపూరిత నంబర్లను కూడా ఇందులో ఫిర్యాదు చేయొచ్చన్న ప్రధాని.. పుణేకు చెందిన హిమాన్షు సింగ్ 300కు పైగా అనుమానాస్పద నంబర్లను నివేదించారని, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వివేక్ అల్హరి 900కు పైగా మోసపూరిత నంబర్లను నివేదించారని, వీరి ప్రయత్నంతో వేలాది అనుమానిత కనెక్షన్లు నిలిచిపోయాయన్నారు.

23 భాషల్లో అందుబాటులో ఉన్న సంచార్ సాథీ యాప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, డిజిటల్ భద్రతకు తోడ్పడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.భారతీయ సంప్రదాయ తీపి పదార్థాలు, చాక్లెట్ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు పొందుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సేంద్రియ తాటి బెల్లం తొలిసారిగా ఐరోపాకు ఎగుమతి అయిందని తెలిపారు.

గత ఏడాది చాక్లెట్, కోకో ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 25 శాతం పెరిగాయని చెప్పారు. స్థానిక పదార్థాలతో కొత్త రుచులను సృష్టిస్తున్న స్టార్టప్‌లు రైతులు, యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. గుజరాత్‌లోని కచ్‌లో ఒంటె పాలతో అమూల్ చాక్లెట్లు, కుంకుమపువ్వు రుచిగల పాలు, రాజ్‌భోగ్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నట్లు వివరించారు. సూరత్‌కు చెందిన ష్మిటన్ చాక్లెట్ సంస్థ కూడా భారతీయ ఫైన్ చాక్లెట్లకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'ఐగాట్ కర్మయోగి' డిజిటల్ వేదిక గురించి ప్రస్తావించారు. 17 భారతీయ భాషల్లో 7 వేలకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్న ఈ వేదిక ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. 200కు పైగా కోర్సుల్లో 3.25 కోట్లకు పైగా కోర్సులు పూర్తయ్యాయని వెల్లడించారు. 'నాగరిక్ దేవో భవ' అనే సూత్రంతో ప్రజలకు మెరుగైన సేవలందించడమే మిషన్ కర్మయోగి లక్ష్యమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+