25 రోజులుగా థియేటర్లలో సునామీ.. బాక్సాఫీస్‌ సంచలనం..

బాలీవుడ్ స్టార్ దర్శకుడు, దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన దృశ్య కావ్యం 'రామాయణ' మూవీ. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్ నటించారు. అలాగే సీతాదేవిగా సాయి పల్లవి నటించారు. ఇక రావణుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించారు. హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ అలరించారు. లక్ష్మణుడిగా రవి దూబే నటించారు. ఈ మూవీ గత 25 రోజులుగా థియేటర్లలో భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ దూసుకెళ్తోంది. 24 రోజుల్లో రామాయణ మూవీ రూ. 1800 క్లబ్ లోకి అడుగుపెట్టింది. దాంతో ఈ ఫీట్ ను సాధించిన అతి కొద్ది చిత్రాల్లో ఒకటిగా రామాయణ నిలిచింది.

అటు నార్త్ అమెరికాలోనూ ఈ మూవీ అఖండ విజయం సాధించింది. అక్కడ ఇప్పటికే బాహుబలి 2, ధురంధర్ 2 చిత్రాల రికార్డులను అధిగమించింది. నార్త్ అమెరికాలో ఏకంగా 30 మిలియన్ డాలర్ల మార్కును దాటి ప్రదర్శితం అవుతోంది ఈ సినిమా. ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం భారత్‌ లో ఇప్పటివరకు రూ.1,015.20 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అలాగే రూ.1,212.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని కొల్లగొడుతుందో తెలియాల్సి ఉంది.

Ramayana bollywood film is taking the industry by storm How much has it earned in 24 days latest

ప్రస్తుతం నితీష్ తివారీ- అమీర్ ఖాన్ కాంబోలో వచ్చిన 'దంగల్' మూవీ టాప్ ప్లేస్ లో ఉంది. 2016 లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.2,070 కోట్ల వసూళ్లను రాబట్టి అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు రామాయణ మూవీ ఆ చిత్రం రికార్డులపై కన్నేసింది. రానున్న రోజుల్లో దంగల్ రికార్డులను అధిగమించే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ పార్ట్-2 2028 లో విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+