స్టాలిన్ తో ఇండియా కూటమి నేతల భేటీ..! డీలిమిటేషన్ పై కీలక నిర్ణయం..!
కేంద్రం వచ్చే వారం పార్లమెంట్ లో తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను (MK Stalin) తన నిర్ణయం మార్చుకోవాలని కోరేందుకు ఇవాళ ఇండియా కూటమి (INDIA Bloc) నేతలు కలిశారు. చెన్నైలోని ఆయన నివాసం అన్నా అరివాలాయనికి వచ్చిన ఇండియా కూటమి నేతల్ని స్టాలిన్ ఎదురేగి స్వాగతించారు. ప్రస్తుతానికి ఇండియా కూటమిలోనే ఉంటున్నా, సమావేశాలకు మాత్రం హాజరు కాకుండా దూరంగా ఉంటున్న స్టాలిన్.. ఇవాళ మాత్రం కూటమి నేతల్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. అనంతరం కూటమి నేతలు స్టాలిన్ తో చర్చలు ప్రారంభించారు.
ఇవాళ స్టాలిన్ ను భేటీ అయిన వారిలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ సహా ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నారు. ఈ భేటీలో డీఎంకే ఎంపీ, స్టాలిన్ సోదరి కనిమొళి కూడా కూర్చొన్నారు. వీరంతా తమిళనాడు ప్రయోజనాలకు విఘాతం కల్పించే డీలిమిటేషన్ బిల్లుకు ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతివ్వొద్దని స్టాలిన్ ను కోరారు. అయితే దీనిపై స్టాలిన్ తన నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
