'రామ్‌చరణ్ నా ఫోన్ ఎత్తడం లేదు'.. సినిమా ఫ్లాప్ తర్వాత మారిన లెక్కలు!

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ 2013లో విడుదలైన 'జంజీర్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అపూర్వ లఖియా తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్‌తో కలిసి 'మాతృభూమి' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 'జంజీర్' బాక్సాపీస్ వద్ద బోల్తా పడిన తర్వాత రామ్ చరణ్ తన ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడం మానేశారని అపూర్వ లఖియా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సంక్రాంతికి చిరంజీవి 'కాకా' మూవీ.. 'ఆటో జానీ' గా మెగాస్టార్ విధ్వంసం..
సంక్రాంతికి చిరంజీవి 'కాకా' మూవీ.. 'ఆటో జానీ' గా మెగాస్టార్ విధ్వంసం..

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన వార్-డ్రామా 'మాతృభూమి' ఎట్టకేలకు డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. 'లగాన్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన అపూర్వ లఖియా.. 2013లో రామ్ చరణ్‌కు హిందీలో తొలి అవకాశం ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ సూపర్‌హిట్ సినిమా 'జంజీర్' రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాతే రామ్ చరణ్ తన ఫోన్ ఎత్తడం ఆపేశారని అపూర్వ లఖియా పేర్కొన్నారు.

Ram Charan Doesn t Pick My Calls Apoorva Lakhia Opens Up After Zanjeer Box Office Flop Full Details

రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.25 కోట్ల వసూళ్లు
'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా', 'హసీనా పార్కర్' వంటి సినిమాలను తెరకెక్కించిన అపూర్వ లఖియాకు 'జంజీర్' పరాజయం పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. తెలుగులో స్టార్‌గా ఉన్న రామ్ చరణ్‌కు ఇది మరింత బాధ కలిగించింది. బాలీవుడ్‌లో తన కెరీర్‌కు మంచి పునాది పడుతుందని ఆయన ఆశించారు. కానీ దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

ఫస్ట్ రోజే బిగ్ షాక్..అన్నా నీ సినిమాకు ఇలాంటి పరిస్థితా..?
ఫస్ట్ రోజే బిగ్ షాక్..అన్నా నీ సినిమాకు ఇలాంటి పరిస్థితా..?

'జంజీర్' తర్వాత బాలీవుడ్‌కు దూరం
'జంజీర్' వైఫల్యం తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని రామ్ చరణ్ ఓ పాత ఇంటర్వ్యూలో అంగీకరించారు. మరోవైపు 2023లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అపూర్వ లఖియా మాట్లాడుతూ.. సినిమా తర్వాత రామ్ చరణ్ తన కాల్స్‌కు స్పందించడం లేదని చెప్పారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించిన 'జంజీర్'.. రామ్ చరణ్ నటించిన ఏకైక హిందీ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఆయన మళ్లీ బాలీవుడ్‌లో కనిపించలేదు.

రామ్ చరణ్ ఫోన్ ఎత్తడం లేదు: అపూర్వ లఖియా
2023లో సిద్ధార్థ్ కన్నన్ తో జరిగిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌తో తన సంబంధాలపై అపూర్వ లఖియా మాట్లాడారు. 'జంజీర్' విడుదలైన కొంతకాలం వరకు ఇద్దరి మధ్య స్నేహం కొనసాగిందని.. తాను పలుమార్లు ఆయనను కలిశానని తెలిపారు. అయితే ఆ తర్వాత క్రమంగా రామ్ చరణ్ ఫోన్ ఎత్తడం ఆపేశారని చెప్పారు. తాను ఎన్నో సార్లు కలవడానికి వెళ్లినా రామ్ చరణ్ నుంచి స్పందన ఉండేది కాదని.. చరణ్ భార్య మాత్రం తన కాల్స్‌కు సమాధానం ఇచ్చేవారని.. బహుశా చరణ్ ఫోన్ నంబర్ మార్చి ఉండవచ్చని అపూర్వ లఖియా వ్యాఖ్యానించారు.

మంచి అవకాశం వస్తే హిందీలో చేస్తా: రామ్ చరణ్
అంతకు ముందు 2018లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలి హిందీ సినిమా వైఫల్యంపై రామ్ చరణ్ స్పందించారు. బాలీవుడ్ ప్రేక్షకుల ముందు నిలబడాల్సిన ఒత్తిడి మధ్య తాము నిజాయితీగా ప్రయత్నించామని.. దురదృష్టవశాత్తూ అది ఫలించలేదని అన్నారు. తొలి హిందీ సినిమా కావడం, భారీ అంచనాలు ఉండటంతో బాధ కలిగిందని పేర్కొంటూనే.. బాలీవుడ్‌కు తలపులు మూసేయలేదని.. భవిష్యత్తులో మంచి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని స్పష్టం చేశారు.

టాలీవుడ్‌లో దూకుడు.. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ క్రేజ్
'జంజీర్' షాక్ నుంచి తేరుకున్న రామ్ చరణ్ తెలుగు సినిమాలో అద్భతు విజయాలు అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవలి కాలంలో 'గేమ్ ఛేంజర్', 'ఆచార్య'.. అలాగే ఈ ఏడాది విడుదలైన 'పెద్ది' సినిమాలు మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+