బీజేపీ ఆఫీసుపై రాళ్ల దాడి.. యూట్యూబర్ కోసం రచ్చ!
బీహార్ రాజధాని పాట్నాలోని వీర్ చంద్ పటేల్ పథ్‌లో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ (యూట్యూబర్) కార్యక్రమానికి సంబంధించి తీవ్ర కలకలం రేగింది. మిల్లర్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించతలపెట్టిన ఈ కార్యక్రమానికి భారీగా జనం చేరే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ మద్దతుదారులు, యువకులు ఆందోళనకు దిగి తీవ్ర హంగామా సృష్టించారు. ఈ క్రమంలో అక్కడి బీజేపీ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
అనుమతి నిరాకరణతో భగ్గుమన్న ఆగ్రహం
మిల్లర్ స్కూల్ గ్రౌండ్‌లో జరగాల్సిన యూట్యూబర్/ఇన్‌ఫ్లుయెన్సర్ కార్యక్రమానికి భద్రతా, రద్దీ దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. నిరసన సెగ వీర్ చంద్ పటేల్ పథ్ వరకు పాకింది.

బీజేపీ కార్యాలయం వద్ద రాళ్ల దాడి.. అలజడి
ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో కొందరు నిరసనకారులు బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లి రాళ్లు విసిరారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు. ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
पटना बीजेपी कार्यालय पर पत्थरबाजी, पुलिस बल तैनात #BiharPolice https://t.co/gWUywOZJGA
— NBT Bihar (@NBTBihar) November 29, 2026














Click it and Unblock the Notifications
